Career and Jobs in Digital Marketing : ప్రపంచం రోజురోజుకు మారుతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు ఒక క్లిక్‌తో వ్యాపారులు, వ్యాపారానికి సంబంధించిన సమాచారం మన చేతుల్లోకి వస్తుంది. ఓ 30 ఏళ్లు వెనక్కి వెళ్తే ఇలా జరిగే అవకాశం ఉంటుందని ఊహించిన వారి సంఖ్య కాస్త తక్కువగానే ఉంటుంది. అటు మార్కెట్ 55 శాతం డిజిటల్‌గా మారిపోయింది. ఇక రానున్న 10 సంవత్సరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), బ్లాక్‌చెయిన్ , డిజిటల్ మార్కెటింగ్(Digital Marketing) లాంటి రంగాలకు కళ్లు చెదిరే డిమాండ్ ఉంటుందన్నది నిపుణులు మాట. ఎందుకంటే దేశంలో డిజిటలైజేషన్(Digitalization) వేగంగా పెరుగుతోంది. ఇది 80 కోట్ల మందికి పైగా ప్రజలను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, కూ, లింక్డిన్, టెలిగ్రామ్, స్నేప్‌చాట్, షేర్ చాట్ లాంటి సోషల్ మీడియా వెబ్‌సైట్(Social Media Website) లను కోట్లాది మంది నిత్యం విజిట్ చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఈ ఫ్లాట్‌ఫారమ్స్‌నే ఉపయోగిస్తున్నాయి. దీని వల్ల లక్షలాది మంది యువత డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉద్యోగాలు పొందుతున్నారు.
లక్షల కోట్ల వ్యాపారం:
కంపెనీ ప్రారంభం నుంచి 2023 వరకు ఈ-కామెర్స్ (E-Commerce) దిగ్గజం అమెజాన్(Amazon) సుమారు 3 లక్షల 80 వేల కోట్ల ఉత్పత్తులను విక్రయించింది. దీన్ని బట్టి డిజిటల్ మార్కెటింగ్ రంగం ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. నేడు దేశంలో వేలాది వెబ్‌సైట్లు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కోట్లాది రూపాయల టర్నోవర్‌ను చూపిస్తున్నాయి. అందుకే డిజిటల్ మార్కెటింగ్ పరిశ్రమ అనేక లక్షల కోట్ల విలువైనదిగా మారింది. మీరు కూడా గ్రాడ్యుయేట్ అయి ఉండి, ఈ పరిశ్రమలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? ఈ ఫీల్డ్‌లో విజయం కోసం మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేయవచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ కోర్సు తర్వాత ఎలాంటి జాబ్స్ రావొచ్చు?
--> డిజిటల్ మార్కెటర్
--> సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్(SEO)
--> PPC
--> సోషల్ మీడియా మార్కెటింగ్(SMM)
--> సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ (SEM)
--> వెబ్ డెవలపర్ అండ్ వెబ్ డిజైనర్
--> కంటెంట్ రైటర్
--> డిజిటల్ ఏజెన్సీ అకౌంట్ మేనేజర్
--> బ్లాగర్.
--> ఫ్రీలాన్సర్
--> ఇ-మెయిల్ మార్కెటర్
--> గూగుల్ యాడ్ మేనేజర్
జీతం ఎంత వరకు రావొచ్చు?
డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసిన తర్వాత యువతకు మొదట్లో నెలకు రూ.25-30 వేల ఉద్యోగం వస్తుంది. అనుభవం పెరిగేకొద్దీ అదే కంపెనీలో జీతం 30 శాతం వరకు పెరుగుతుంది. కంపెనీ మారితే 40-50 శాతం జీతం పెరుగుతుంది. ఇక స్కిల్ ఉన్నవాడికి జీతం వేగంగా పెరుగుతుంది.
Also Read : మహిళలకు షాకింగ్ న్యూస్..హడలెత్తిస్తున్న బంగారం ధరలు..తులం 70వేలకు దగ్గరలో..