Srisailam Dam: నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం సమీపంలోని లింగాల గట్టు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. లింగలగట్టు గంగ బ్రిడ్జి కింద కారును ఆపి స్నానాలకు వెళ్లారు తెలంగాణకు చెందిన వికారాబాద్ జిల్లా ప్రయాణికులు. అయితే, వారు స్నానం చేస్తున్న సమయంలో హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో కారు నీటితో మునిగిపోయింది. గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై స్థానికుల సహాయంతో కారును నీటిలో నుంచి బయటకు తీశారు. చివరికి కారు, ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: ఇండియా కూటమికి జగన్ అవసరం లేదు.. మాజీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్..!
కాగా, శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి వరద ప్రవహం పోటెత్తడంతో అధికారులు ఏడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న మూడు గేట్లు లిఫ్ట్ చేయగా నేడు ఉదయం 2 గేట్లు, తాజాగా మరో 2 గేట్లు విడుదల చేశారు. దీంతో శ్రీశైలం డ్యాంను చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆగస్టు 1వ తేదిన సీఎం చంద్రబాబు సైతం శ్రీశైలం జలాశయంను పరిశీలించనున్నారు.