Car : కారు లైఫ్‌ను పెంచే చిట్కాలు!

New Update
Car : కారు లైఫ్‌ను పెంచే చిట్కాలు!

Car Life Tips : ఇప్పుడు చాలామంది కారు(Car) ను ఒక సాధారణ అవసరంగా చూస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే వెహికల్ కొనగానే సరిపోదు, దాన్ని సరిగా వాడటం తెలియాలి. ముఖ్యంగా వాహనం జీవిత కాలాన్ని(Life Time) పెంచాలంటే, దాన్ని ఎలా మెయింటెన్ చేయాలో తెలుసుకోవాలి. లేదంతే వెహికల్ పనితీరు దెబ్బతింటుంది. అందుకే కొన్ని ముఖ్యమైన పార్ట్స్‌పై కచ్చితంగా దృష్టి పెట్టాలి. కారు నడిపే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మెయింటెన్స్ టిప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

టైర్లు: వెహికల్ టైర్లు(Vehicle Tires) ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. టైర్స్ వేర్, స్ప్లిట్స్, బుల్జెస్, ట్రెడ్ డెప్త్ చూడాలి. మినిమం లీగల్ ట్రెడ్ డెప్త్ 1.6 మిమీ ఉండాలి. వింటర్ సీజన్‌ అయితే మంచి ట్రాక్షన్ కోసం 3 మిమీ లక్ష్యంగా పెట్టుకోండి. అలాగే మాన్యువల్ ప్రకారం టైర్ ప్రెజర్ ఉండేలా చూసుకోవాలి.

బ్రేకులు: వెహికల్ బ్రేక్ ఫ్లూయిడ్ లెవల్ రెగ్యులర్‌గా చెక్ చేయండి, అవసరమైతే నింపండి. కారు హ్యాండ్‌బుక్ ప్రకారం, బ్రేక్ ఫ్లూయిడ్‌ను సిఫార్సు చేసిన వ్యవధిలో మార్చాలి. దీనిపై కచ్చితమైన సమాచారం తెలియకుంటే, నిపుణులను సంప్రదించండి.

ఇంజిన్ ఆయిల్ లెవల్: డిప్‌స్టిక్‌(Dipstick) సాయంతో కారు ఇంజిన్ ఆయిల్ లెవల్ రెగ్యులర్‌గా చెక్ చేయాలి. ఇది మినిమం, మాగ్జిమం మార్క్స్‌ మధ్య ఉండేలా చూసుకోండి. తక్కువ ఆయిల్ ఉంటే, ఇంజిన్ దెబ్బతింటుంది, కాబట్టి జాగ్రత్తపడాలి.

బ్యాటరీ: కారు బ్యాటరీ టెర్మినల్స్ క్లీన్‌గా, టైట్‌గా ఉండాలి. ఎక్కడైనా తుప్పు పడితే, వేడి నీటితో శుభ్రం చేసి, పెట్రోలియం జెల్లీ లేదా బ్యాటరీ టెర్మినల్స్ కోసం రూపొందించిన ప్రొడక్ట్స్ అప్లై చేయండి. ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటే, బ్యాటరీని చెక్ చేసుకోండి. అది నాలుగు సంవత్సరాల కంటే పాతది అయితే రెగ్యులర్‌గా మానిటర్ చేయాలి.

కూలెంట్: వెహికల్ కూలెంట్ లెవల్ సరిగా ఉండాలి. దీన్ని పట్టించుకోకపోతే ఇంజిన్ వేడెక్కడం లేదా గడ్డకట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్‌కు ముందు కూలెంట్ చెక్ చేయాలి. ఇంజిన్ హాట్‌గా ఉన్నప్పుడే దాన్ని చెక్ చేయండి, మీ హ్యాండ్‌బుక్ ప్రకారం సరైన కూలెంట్ వాడండి.

లైట్లు: వెహికల్ లైట్లు అన్నీ సరిగా పని చేస్తున్నాయో లేదో చూడండి. హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు చెక్ చేసి, ఏవైనా తేడాలు ఉంటే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాలి.

Also Read : కుర్తీ ధరించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లుక్ పాడవుతుంది

Advertisment
తాజా కథనాలు