Sleeping: తెల్లవారుజామున 2 గంటలకు వరకు నిద్రరావడం లేదా?..పరిష్కారం ఇదే

నిద్ర లేకపోవడం భవిష్యత్తులో మధుమేహం, ఊబకాయం, గ్యాస్ట్రిక్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మానసిక వ్యాధులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీరోజూ వ్యాయామం, యోగా, ప్రాణాయామ ధ్యానం చేస్తే నిద్ర సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.

New Update
Sleeping: తెల్లవారుజామున 2 గంటలకు వరకు నిద్రరావడం లేదా?..పరిష్కారం ఇదే

Sleeping: నిద్ర లేకపోవడం భవిష్యత్తులో మధుమేహం, ఊబకాయం, గ్యాస్ట్రిక్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయవచ్చు. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మానసిక వ్యాధులు కూడా పెరుగుతాయి. నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు నిద్రమాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే వైద్యులను సంప్రదించి నిద్రమాత్రలు వాడవచ్చు. కానీ మొత్తం నిద్రలేమిని సహజంగా పరిష్కరించవచ్చు. మీరు చిన్న జీవనశైలి మార్పులను చేయడం ద్వారా నిద్ర నాణ్యతను పెంచుకోవచ్చు.

కెఫిన్ తీసుకోవడం మానుకోండి:

  • సాయంత్రం తర్వాత టీ, కాఫీ తీసుకోవద్దు. టీ, కాఫీలలో కెఫీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. టీ, కాఫీ తాగితే అంత తేలికగా నిద్రపట్టదు.

నిద్రవేళను సెట్ చేయండి:

  • సరైన సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోండి. అలాగే పడుకునే ముందు మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వాడే అలవాటును మానుకోండి. పడుకునే ముందు గంట సేపు ల్యాప్‌టాప్, మొబైల్ ఉపయోగించడం మానుకోండి. అవసరమైతే పుస్తకాలు చదవవచ్చు, డైరీ వ్రాయవచ్చని నిపుణులు అంటున్నారు.

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి:

  • మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యను పెంచుతుంది. నిద్ర మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటే, ఆందోళన-డిప్రెషన్ వంటి సమస్యలు ఉంటే మానసిక వైద్యుడిని సంప్రదించండి.

యోగా, వ్యాయామాలకు సమయం కేటాయించండి:

  • మీరు రోజంతా శారీరకంగా చురుగ్గా ఉండకపోతే రాత్రిపూట సులభంగా నిద్రపోరు. వ్యాయామం ముఖ్యం. యోగా, ప్రాణాయామ ధ్యానం నిద్ర సమస్యలకు సహాయపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు యోగా చేయండి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం:

  • నిద్రకు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. కార్బోహైడ్రేట్లు, కొవ్వును తగ్గించండి. ప్రోబయోటిక్ ఆహారాలు నిద్రలేమి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం రోజూ పుల్లటి పెరుగు తినవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఈ పాన్‌కేక్..టేస్ట్‌కి బాప్..హెల్త్‌కి టాప్..అందుకే టాప్‌టెన్ లిస్ట్‌లో ప్లేస్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు