Lok Sabha Sessions: 'జై సంవిధాన్' అని చెప్పకూడదా.. స్పీకర్‌పై ప్రియాంక ఆగ్రహం

లోక్‌సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్ జై సంవిధాన్ అని నినాదం చేయడంతో.. దీంతో అక్కడున్న విపక్ష ఎంపీలు కూడా జై సంవిధాన్ అని నినాదం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా దీనిపై అభ్యంతరం వ్యక్తం చెప్పగా కాంగ్రెస్ అధినేత్రి ప్రియాకం గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Lok Sabha Sessions: 'జై సంవిధాన్' అని చెప్పకూడదా.. స్పీకర్‌పై ప్రియాంక ఆగ్రహం

Priyanka Gandhi: లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేసే సందర్భంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi).. జై పాలస్తీనా (Jai Palestine) అని నినాదం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. మరికొందరు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే కేరళలోని తిరువనంతపురం నుంచి నాలుగోసారి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత శశిథరూర్ (Shashi Tharoor) గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన జై హింద్, జై సంవిధాన్ అని నినాదం చేశారు. దీంతో అక్కడున్న విపక్ష ఎంపీలు కూడా జై సంవిధాన్ (Jai Samvidhan) అని నినాదం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా (Om Birla) దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read: 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్

దీంతో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మాట్లాడుతూ.. దీనికి స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయకూడదని అన్నారు. దీంతో స్పీకర్ స్పందించారు. ఎలాంటి వాటికి అభ్యంతరం చెప్పాలో చెప్పకూడదో అనేదానిపై నాకు సలహాలు ఇవ్వొందంటూ హుడాపై ధ్వజమెత్తారు. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా స్పందిచారు. పార్లమెంటులో జై సంవిధాన్ అని కూడా అనకూడదా అంటూ ప్రశ్నించారు.

పార్లమెంటులో అధికార పార్టీ నేతలు అన్‌పార్లమెంటరీ, రాజ్యాంగ విరుద్ధ నినాదాలు చేసినప్పుడు వీళ్లేవ్వరు అడ్డుచెప్పరు. కానీ విపక్ష ఎంపీలు జై సంవిధాన్ అనే నినాదాలు చేస్తే మాత్రం అడ్డుచెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయలో వచ్చిన రాజ్యాంగ వ్యతిరేక సెంటిమెంట్‌ ఇప్పుడు కొత్త రూపంలోకి వచ్చిందని.. ఇది మన రాజ్యాంగాన్ని బలహీనపరచాలని చూస్తోందని మండిపడ్డారు. దేని ఆధారంగా పార్లమెంటు పనిచేస్తుందో.. దేనిపై ప్రతి సభ్యుడు ప్రమాణస్వీకారం చేస్తారో.. ప్రతిఒక్కరి జీవితానికి ఏదైతే రక్షణ కల్పిస్తుందో అలాంటి రాజ్యాంగాన్ని.. విపక్షాల గొంతును అణిచేవేసేందుకు వ్యతిరేకిస్తారా అంటూ ప్రశ్నించారు.

Also Read: ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. లీకేజీలు, కూలిపోవడాలు, పగుళ్లు.. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి!

Advertisment
Advertisment
తాజా కథనాలు