AP TDP: టీడీపీ రెబల్స్ గా నామినేషన్లు వేసిన అభ్యర్థులను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన శ్యాం కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, నియోజకవర్గానికి చెందిన శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డ రాజశేఖర్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెబుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Osmania University: ఓయూలో కరెంట్, తాగునీటి కొరత.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన!
నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో..
ఇక అధిష్టానం సిటీ ఇవ్వకపోవడంతో ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన పలువురు టీడీపీ నేతలు. అయితే ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. వీరంతా వెనక్కు తీసుకుంటారని భావించింది. అయితే ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ఆయా అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు వేసింది.