Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చుట్టూ వివాదాలు కమ్ముకున్నాయి. ఆమెను ఎంపీగా కొనసాగించరాదని.. లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సైభ నైతిక విలువల కమిటీ సిఫార్సు చేసింది. మెయిత్రా (Mahua Moitra) చేసిన చర్యలు అత్యంత అభ్యంతరకమైనవని, అనైతికమైవి, నేరపూరితమైనవంటూ పెర్కొన్నారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. లోక్‌సభలో అదానీ కంపెనీల (Adani Group) గురించి ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా.. హీరానందాని అనే పారశ్రామిక వేత్త నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే (Nishikant Dubey) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై 15 మంది సభ్యులత కూడిన కమిటీ విచారణ జరిపింది. ఆమె అనైతిక చర్యలపై కేంద్ర ప్రభుత్వం.. న్యాయ, సంస్థాగత, కాలపరిమతితో కూడిన విచారణ చేపట్టాలని కమిటీ తెలిపింది.
ఇందుకోసం 500 పేజీలతో కూడిన ఈ కమిటీకి సంబంధించిన నివేదికలోని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఈ నివేదికను పరిశీలించి తర్వతా దీన్ని ఆమోదించేందుకు గురువారం సమావేశం కావాలని లోక్‌సభ నైతిక విలువల కమిటీ నిర్ణయించింది. కానీ ఈ లోపలే నివేదికలో ఉన్న అంశాలు బయటకు రావడం చర్చనీయమయ్యాయి. అయితే ఆ నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై లోక్‌సభలో చర్చలు చేపట్టిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం కేసు… సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ఇదిలాఉండగా.. మరోవైపు మహువా మొయిత్రాపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ (CBI) విచారణకు లోక్‌పాల్ ఆదేశించినట్లు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే బుధవారం పేర్కొన్నారు. జాతి భద్రతను పణంగా పెట్టిన అవినీతి వ్యవహారంపై మొయిత్రాపై సీబీఐ విచారణకు ఈ రోజు లోక్‌పాల్ ఆదేశించిందని దుబే ఎక్స్ (ట్విట్టర్) లో తెలిపారు. అయితే ఇప్పటివరకు లోక్‌పాల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక దుబే ప్రకటనపై మొయిత్రా తన స్పందనను తెలియజేసింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన బొగ్గు కుంభకోణం ఆరోపణలపై ముందుగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ పేర్కొంది.