Nijjar Murder : ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా పోలీసులు(Canada Police) ముగ్గురుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎడ్మంటన్‌లో నివాసం ఉంటున్న భారత పౌరులు కరణ్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్‌ప్రీత్ సింగ్ (28)లపై హత్య, హత్యకు కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. త్వరలో మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయన్నారు. అయితే ఈ కేసులో అరెస్టయిన ఈ ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: యుద్ధ విమానాలను నడిపే సరికొత్త కృత్రిమ మేధస్సు
సదరు వర్గాలు పలు కీలక విషయాలు మీడియాకు వెల్లడించాయి. 'కొందరు గ్యాంగ్‌స్టర్లు కెనడాలో ఉంటూ ఇండియా(India) లో నేర కార్యకలాపాలు చేస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) నిందితులుగా పేర్కొన్న చాలామంది కూడా కెనడాలో స్థిరపడ్డారు. భారత్‌కు వ్యతిరేకంగా, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించడానికి వాళ్లకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి. దీని గురించి మేము ఎన్నోసార్లు ఆధారాలు ఇచ్చినప్పికీ కెనడా ప్రభుత్వం, పోలీసుల నుంచి సపోర్ట్ లభించలేదు. ఇప్పుడు సరైన ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు వేస్తోంది. అరెస్టయిన ఈ ముగ్గురు డ్రగ్స్ దందా చేస్తున్నారని.. వీళ్లకు పాక్ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు మాకు తెలిసిందని' సదరు వర్గాలు మీడియాకు తెలిపాయి.,
ఇదిలాఉండగా.. కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత ప్రభుత్వ ప్రమేయం కోణంలో కూడా విచారణ సాగుతోందని.. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగం తెలిపింది. 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ సర్రేలోని గురద్వారా బయట ఉన్న నిజ్జర్‌ను గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్చి చంపేశారు. ఈ హత్య వెనుక భారత ప్రమేయం ఉందంటూ అప్పట్లో కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో ఆరోపించారు. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్యపౌర విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
Also Read: సిక్కుల పవిత్ర గ్రంథం పేజీలు చింపినందుకు యువకుడు దారుణ హత్య