Camel: కారు ఎక్కిన ఒంటే.. ఏకంగా డ్రైవర్ సీట్లోనే: వీడియో వైరల్! రాజస్థాన్ ఎడారిలో ఓ ఒంటే కారు ఎక్కేసింది. శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న కారుకు అడ్డురావడంతో డ్రైవర్ రెప్పపాటులో ఒంటెను ఢి కొట్టాడు. దీంతో బానెట్ అద్దం పగిలి ఒంటే లోపలికి చొచ్చుకుపోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. By srinivas 09 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rajasthan: రాజస్థాన్ ఎడారిలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హనుమాన్ ఘడ్ లో శనివారం రాత్రి వేగంగా వెళుతున్న ఓ కారు రోడ్డు పై నడుచుకుంటూ వెళుతున్న ఒంటెను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒంటే వెనుక భాగం కారు బానెట్ అద్దం పగలగొట్టుకొని కారులోకి వెళ్లింది. ఒంటె నడుము భాగం వరకు కారు ముందు అద్దంలో ఇరుక్కొని పోవడంతో ఒంటె కారుపైకి ఎక్కినట్లుగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. राजस्थान : हनुमानगढ़ जिले में ऊंट और कार का एक्सीडेंट। कार की विंड स्क्रीन में फंसा ऊंट, चोटिल हुआ। कार वाले सेफ हैं। pic.twitter.com/IhQPxmF0l9 — Sachin Gupta (@SachinGuptaUP) June 9, 2024 అయితే ఈ ఘటనలో కారులో ఉన్న వారికి, ఒంటెకు కానీ ఎటాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అనంతరం అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు ఒంటెను కారులో నుంచి బయటకు తప్పించి కాపాడారు. మాములుగా ఎడారి ప్రాంతంలో ఒంటెల వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కానీ, ఇలా జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పేలుస్తున్నారు. #rajastan #camel #toyota-car మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి