పోక్సో కేసుపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్తవయసులో ఉండే.. అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ సూచనలు చేసింది. కేవలం రెండు నిమిషాల సుఖం కోసం లొంగిపోకూడదని.. సమాజంలో ఇది ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. అలాగే అబ్బాయిలు కూడా మహిళల పట్ల గౌరవంగా.. మర్యాదగా వ్యవహరించాలని సూచించింది. పరస్పర సమ్మతి చేసుకొని సెక్స్‌లో పాల్గొనే కేసుల్లో.. పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై కలకత్తా హైకోర్టు ఈ హైకర్టు ఇలా స్పందించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మైనర్ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొనందుకు గత ఏడాది ఓ యువకునికి సెషన్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తీర్పుపై ఆ యువకుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అత్యాచారం కేసులో అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు.. యుక్త వయసు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలకు పలు కీలక సూచనలు చేసింది.
అయితే ఈ విచారణలో తన ఇష్టపూర్వకంగానే ఆ యువకునితో రిలేషన్‌లో ఉన్నట్లు ఆ బాలిక కోర్టుకు చెప్పింది. అతడ్ని వివాహం కూడా చేసుకున్నానని తెలిపింది. అంతేకాదు 18 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం అనేది కూడా చట్ట విరుద్ధమని ఆమె అంగీకరించింది. అయితే పోక్సో చట్టం ప్రకారం చూస్తే.. 18 ఏళ్ల లోపు శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు వస్తుంది. వాస్తవానికి యుక్తవయసులో సెక్స్ అనేది సాధరమైన విషయమని.. ఇలాంటి కోరికలను ప్రేరేపించడం అనేది వ్యక్తులు చేసే చర్యల మీద ఆధారపడి ఉంటుందంటూ ధర్మాసనం పేర్కొంది. అయితే టినేజీలో.. యుక్త వయసు ఉన్న బాలికలు 2 నిమిషాల సుఖం కోసం శృంగారం వైపు మొగ్గు చూపొద్దని.. లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచనల చేసింది. కేవలం రెండు నిమిషాల కోసం ఆశపడితే.. సమాజంలో వారికి చెడ్డ పేరు వస్తుందంటూ తెలిపింది. ముఖ్యంగా బాలికలకు వ్యక్తిత్వం, ఆత్మగౌరవం అనేవి అన్నిటికంటే ముఖ్యమైనవని చెప్పింది.
అలాగే యుక్తవయసులో అబ్బాయిలు కూడా అమ్మాయిలను గౌరవించాలని చెప్పింది. అలాగే వారి హక్కులను, గోప్యతను,ఆత్మగౌరవాన్ని.. ఆమె శరీర స్వయంప్రతిపత్తిని కాపాడుకునేలా వ్యవహరించాలని పేర్కొంది. అయితే ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలని.. అలాగే మంచి-చెడు విషయాల గురించి చెప్పాలని సూచనలు చేసింది. ఇక మగపిల్లలకు తల్లిదండ్రులు ఆడవాళ్లను ఎలా గౌరవించాలో చెప్పాలని.. లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా వాళ్లతో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని సూచనలు చేసింది. ఇక యుక్త వయస్సులో లైంగిక సంబంధాల వల్ల తలెత్తే చట్టపరమైన సమస్యలను నివారించేందుకు పాఠశాలలో లైంగిక విద్య అవసరమని పేర్కొంది.