Megha Scam Row: కేసీఆర్‌ను నిండా ముంచిన కృష్ణారెడ్డి.. గులాబీ బాస్‌ చెవిలో 'మేఘా' క్యాబేజీ!

ఎన్నికల ముందు వరకు కేసీఆర్‌ దగ్గర అమాయకంగా నటించి కాంట్రాక్టులతో లక్షల కోట్లు దోచుకున్న మేఘా కృష్ణారెడ్డి.. ఎలక్షన్స్‌ నాటికి బీఆర్‌ఎస్‌ చెవిలో పెద్ద సైజు పువ్వు పెట్టారు. కేసీఆర్‌ను మేఘా కృష్ణారెడ్డి ఎలా నిండా ముంచారో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.

New Update
Megha Scam Row: కేసీఆర్‌ను నిండా ముంచిన కృష్ణారెడ్డి.. గులాబీ బాస్‌ చెవిలో 'మేఘా' క్యాబేజీ!

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరిట వేల కోట్లు దోచుకున్న మేఘా కృష్ణారెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే 48వేల కోట్లు బొక్కిన కృష్ణారెడ్డి చివరకు గులాబీ బాస్‌ కేసీఆర్‌ చెవిలోనే మోయలేనంత పువ్వు పెట్టారు. కేసీఆర్‌ను నిండా ముంచిన మేఘా ఆయన్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష నింద మరొకరు మోయాల్సిన పరిస్థితి కేసీఆర్‌ది. తియ్యటి మాటలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా లక్షల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. ఏ ఒక్క పని కూడా సక్రమంగా చేసిన దాఖలాలు కనిపించడం లేదు.

నాసిరకం నిర్మాణాలతో గత ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చింది. కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకతంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్రతిష్టపాలైందంటే ఈ పాపం ముమ్మాటికి మేఘా సంస్థదే. అయితే ప్రతిపక్షాల నుంచి నింద మోస్తున్నది మాత్రం కేసీఆర్‌. ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్‌, బీజేపీ కాళ్వేశ్వరం టార్గెట్‌గానే కేసీఆర్‌ను కార్నర్‌ చేశాయి. చెప్పాలంటే కాళ్వేశ్వరం చుట్టూనే ఎన్నికల ప్రచారం జరిగింది. ఇది బీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారింది. ఎన్నికల్లో ఓటమిపాలైంది.

ప్రాజెక్టులన్నింటిలో 70వేల కోట్ల దోపిడీ!
ఎన్నికల ముందు వరకు కేసీఆర్‌ దగ్గర అమాయకంగా నటించి లక్షల కోట్ల కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడిన మేఘా సంస్థ.. ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ చెవిలో పెద్ద సైజు పువ్వు పెట్టింది. ఈ విషయాన్ని తలచుకుంటూ బీఆర్‌ఎస్‌ వర్గాలు చాలా బాధపడుతున్నాయి. కేసీఆర్‌కు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్న మేఘా కృష్ణారెడ్డి.. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాజెక్టుల్లో 70వేల కోట్లు దోచుకున్నాడని రిపోర్టులు చెబుతున్నాయి. కాగ్‌ రిపోర్ట్ సైతం మేఘా అవినీతి చిట్టాను బహిర్గతం చేసింది. ఈ ఒక్క రిపోర్ట్‌ చూసినా మేఘా ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విడుదల చేసి లక్షా 50 వేల కోట్లలో ఒక్క మేఘా కృష్ణారెడ్డే 48వేల కోట్లు నొక్కేశాడని కాగ్‌ రిపోర్ట్ బయటపెట్టడం ఆయన ఎంత అవినీతి కళ్లకు కడుతుంది.

అధ్యయనమే చేయలేదు
అసలు అధ్యయనాలే చేయకుండా ప్రాజెక్టులు కట్టడం మేఘా సంస్థకే చెల్లింది. 50 టీఎంసీల(వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు) నిల్వ సామర్థ్యంతో కేఎల్‌ఐఎస్‌ కింద అతిపెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్నసాగర్‌ను నిర్మించడంలో జరిగిన ఘోర తప్పిదాన్ని కాగ్ ఎత్తి చూపింది. అవసరమైన పరిశోధనలు, అధ్యయనాలు నిర్వహించకుండా హడావిడిగా రిజర్వాయర్‌ను నిర్మించారని కాగ్‌ స్పష్టం చేసింది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. 2008లో అప్పటి ప్రభుత్వం పంపులు, మోటార్లు, పరికరాల ఆధారంగా ఖర్చును అంచనా వేస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం నీటిపారుదల శాఖ సలహాదారులు, ఆ శాఖ నుంచి వివరాలు సేకరించి ఖర్చులను సిద్ధం చేసినట్లు కాగ్ తెలిపింది. దీనివల్ల పరికారల కోసం రూ.7,214 కోట్లు అంచనా వేస్తే.. కాంట్రాక్టర్లు మాత్రం బీహెచ్‌ఈఎల్ కంపెనీకి కేవలం రూ.1,686 కోట్లు మాత్రమే చెల్లించారని పేర్కొంది.

దీంతో కాంట్రాక్టర్లకు రూ. 5,188 కోట్ల అదనపు సొమ్ము ముట్టిందని తెలిపింది. దీన్ని చూస్తే చాలు మేఘా కృష్ణారెడ్డి ఎంత దోచుకున్నారో చెప్పడానికి ప్రత్యేకించి వేరే లెక్కలు అవసరం లేదు. ఆ మధ్య వెలువడిన ఫోర్బ్స్ జాబితా చూస్తే ఆయన ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో అర్థమవుతుంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా కంపెనీ ఆస్తుల విలువ అమాంతం పెరిగింది. దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకిందంటే ఆయన కేసీఆర్‌ను ఎంతలా మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. మాయమాటలతో కేసీఆర్‌ చెవిలో మెగా పుష్పం పెట్టిన కృష్ణారెడ్డి అవినీతి చిట్టా గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: హౌస్ ఫుల్… 5 రోజుల్లోనే భారీగా డిమాండ్..లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే మార్చి తర్వాతే..!!

WATCH:

Advertisment
తాజా కథనాలు