KCR: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నిక.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

TG: మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాక తప్పదని అన్నారు. రాజయ్య ఎమ్మెల్యే కావడం ఖాయమని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.

New Update
KCR: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

BRS Chief KCR: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హన్మకొండలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. వరంగల్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. మూడు నెలల్లో స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య ఎమ్మెల్యే కావడం ఖాయమని పేర్కొన్నారు. కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా రాజకీయ జీవితానికి సమాధి చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.

ALSO READ: పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

ఇక ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిండుగా మోసం చేసిందని అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ కాదు కదా అసలు రైతు బంధు కూడా సక్కగా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలోని రైతులకు ఇంకా రైతు బంధు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. రుణమాఫీ సంగతి ఏమైంది? అని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు వస్తున్నారని.. లోక్ సభ ఎన్నికల తరువాత ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని అంటున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి చేసే దమ్ము, సత్తా ఉందా? అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను జైల్లో వేస్తా అంటున్నాడు.. నేను జైలుకు వెళ్లడానికి భయపడితే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు