MLA KTR : త్వరలోనే స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక : కేటీఆర్‌

త్వరలోనే స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఉపఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ నుంచి రాజయ్య గెలుపు ఖాయమని చెప్పారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు కరెంట్ పోతే వార్త.. రేవంత్‌ వచ్చాక కరెంట్‌ ఉంటే వార్త అని సెటైర్లు వేశారు.

New Update
MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు

By Election In Station Ghanpur : ఈరోజు తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ఈ సమావేశంలో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమావేశంలో కేటీఆర్ (KTR) మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని అన్నారు. ఒకటే దఫాలో రుణమాఫీ చేయలేదని అన్నారు. రుణమాఫీ కాలేదు.. రాహుల్ గాంధీకి సభకు రాలేదు అని చురకలు అంటించారు. 

Also Read : హరీశ్ రావు ముక్కు నేలకు రాయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

బోనస్... బోగస్.. 
ఎన్నికల సమయంలో రైతు పండించిన  ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు. ప్రతి వడ్ల రకంపై క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి  వచ్చాక ఇచ్చిన మాట మార్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కేవలం సన్న రకాల వడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని అనడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పింది బోనస్.. చేసింది బోగస్ అని అన్నారు. ప్రతి వరి రకానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఒకటి కాదు.. మూడు ఉపఎన్నికలు.. 

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఉపఎన్నిక రాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే తాటికొండ రాజయ్య గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మూడు ఉప ఎన్నికలు త్వరలో తెలంగాణలో జరిగే అవకాశం ఉందని అన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హైకోర్టులో కేసు నడుస్తోందని అన్నారు. ఈ కేసులో పార్టీ మారిన నాయకులకు బిగ్ షాక్ తగలడం ఖాయమని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు