By Elections: లోక్ సభ ఎన్నికలు ముగిసాయి. మంత్రుల ప్రమాణ స్వీకారాలు, పదవుల కేటాయింపులు అన్నీ ముగిసాయి. ఇప్పుడు మరోసారి ఎన్నికలకు సిద్ధమయింది కేంద్ర ఎన్నికల కమిషన్. దేశ వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అంతకు ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత మంత్రులుగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే అందులో కొందరు మరణించారు. దాంతో వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఆ స్థానాలకే ఉప ఎన్నిక నిర్వహిస్తున్నామని ఈసీ తెలిపింది. బీహార్- 1, పశ్చిమ బెంగాల్- 4, తమిళనాడు- 1, మధ్యప్రదేశ్- 1, ఉత్తరాఖండ్- 2, పంజాబ్- 1, హిమాచల్- 3 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 14న విడుదలైంది. నామినేషన్‌కు చివరి తేదీ జూన్ 21తో ముగిసింది. జూన్ 24న పరిశీలన కూడా జరిగింది. జూన్ 26న నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో జులై 10న ఓటింగ్ జరగనుంది. వీటి ఫలితాలు 13న వస్తాయి.
పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలైన మానిక్తలా, రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్ ,బాగ్దాలో ఉపఎన్నికలు జరగనున్నాయి. వీరందరూ తృణమూల్ కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. కానీ తర్వాత మానిక్తలా టీఎంసీ ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. రాయ్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి కృష్ణ కళ్యాణి, బీజేపీ అభ్యర్థి మానస్ కుమార్ ఘోష్ పోటీ చేస్తున్నారు. మరోవైపు వామపక్ష కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా సీపీఎం సీనియర్ నేత మోహిత్ సేన్ గుప్తా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బాగ్దా అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ నుంచి మధుపర్ణ, బీజేపీ నుంచి బినయ్ కుమార్ విశ్వాస్ బరిలో నిలిచారు. రణఘాట్ సౌత్ నుంచి ముకుత్ మణి అధికారిని టీఎంసీ రంగంలోకి దించింది. ఆయన బీజేపీ అభ్యర్థి మనోజ్‌కుమార్ విశ్వాస్‌తో తలపడనున్నారు.
Also Read:BREAKING: ముగిసిన సీఎంల భేటీ.. విభజన సమస్యలపై కీలక నిర్ణయం