ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే ముందు ఐటం పై ఎంత డిస్కౌంట్ వస్తుందని చూసే రోజులు పోయాయి. ఇప్పడు ఆర్డర్ పై ఎక్స్ట్రా అమౌంట్ ఎంత పడుతుందని చూస్తున్నారు. GST, ప్లాట్ ఫామ్ ఫీజు, ఇంటర్నెట్ చార్జెస్ అంటూ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్స్ కు ఆహార ప్రియులు భారీ మూల్యమే చెల్లిస్తున్నారు.
అయితే ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ జొమాటో తాజాగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఇకనుంచి ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున వసూలుచేయనుంది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.7 గా ఉండేది." పండగ సీజన్‌లో సేవలు అందించేందుకు ప్లాట్‌ఫామ్ ధరలు పెంచాం. మా బిల్లులు చెల్లించేందుకు ఈ రుసుములు సాయపడతాయి.." అని కంపెనీ తన యాప్ ద్వారా తెలియజేసింది.
Also Read : భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా!
2- 2.5 మిలియన్ల ఆర్డర్స్..
జొమాటో ప్లాట్ ఫామ్ ఫీజును పెంచడం ఇది రెండో సారి. గత సంవత్సరం ఆగస్టులో మొదటి సారి ప్లాట్‌ఫాం ఫీజును ప్రవేశపెట్టింది. మొదటి ఆర్డర్‌కు రూ.2 చొప్పున వసూలుచేసేది. క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ ఫీజుకు రూ.10కి తీసుకొచ్చింది. కాగా రోజుకు ఈ ప్లాట్‌ఫామ్ 2- 2.5 మిలియన్ల పుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తుందని అంచనా. ప్లాట్‌ఫామ్ ఫీ పెంపుతో కంపెనీ వృద్ధిపై ప్రభావం చూపనుంది. ఈ ప్రకటన నేపథ్యంలో కంపెనీ షేర్లు రాణించాయి.
Also Read : ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!