స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఈ ఏడాది జూలై Vivo Y28s 5Gని లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ధరను తగ్గించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే 50 మెగా పిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇంకా మరెన్నో అధునాతన, అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు తగ్గిన ధర గురించి తెలుసుకుందాం.
Vivo Y28s 5G New Price
Vivo Y28s 5G మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4GB వేరియంట్ ధర రూ.13,999 ఉంది. అదే సమయంలో 6GB ర్యామ్, 8GB ర్యామ్ వరుసగా రూ.15,499, రూ.16,999గా నిర్ణయించబడింది. ఇప్పుడు ఈ మూడు మోడళ్లపై దాదాపు రూ.500 డిస్కౌంట్ కంపెనీ అందించింది.
దీంతో బేస్ రేంజ్ 4GB ర్యామ్ రూ.13,499 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో 6GB ర్యామ్ రూ.14,999, 8GB వేరియంట్ రూ.16,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ 128GB స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది.
Vivo Y28s 5G Specifications
Vivo Y28s 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.56 అంగుళాల HD+ (720 x 1,612 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చిది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో వచ్చింది. అలాగే ఈ ఫోన్ Android 14-ఆధారిత Funtouch OS 14పై నడుస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే.. ఇది 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ని కలిగి ఉంది. ఫోన్ ముందువైపు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వచ్చింది. అలాగే 15W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కంపెనీ అందించింది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఐపీ6 రేటింగ్‌ను కలిగి ఉంది.