శ్రీవారి భక్తులకు కీలక సూచన.. సాయంత్రం 6 గంటలకు ఈ మంత్రం పఠించాలన్న టీటీడీ! తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు భక్తులంతా ఇళ్లలో ధీపారాధన చేయాలని టీటీడీ సూచించింది. ధీపారాధన సమయంలో 'క్షమ మంత్రం' చదవి స్వామివారి దివ్యానుగ్రహం పొందాలని పండితులు తెలిపారు. By srinivas 23 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirupati: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక పిలుపునిచ్చింది. తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు భక్తులంతా ఇళ్లలో ధీపారాధన చేయాలని సూచించింది. ఈ మేరకు భక్తులంతా ధీపారాధన సమయంలో 'క్షమ మంత్రం' చదవాలని పండితులు సూచించారు. 'ఓం నమో నారాయణాయ.. ఓం నమో భగవతే వాసుదేవాయ.. ఓం నమో వేంకటేశాయ..' మంత్రాలను జపించి, స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందాలని చెప్పారు. Purificatory Shanti Homam ConcludesRitual Held to Ward Off Doshas and for the Benefit of Devotees - TTD EODevotees Should Recite the Kshama Mantra in the Evening - Archakas pic.twitter.com/kpxqcDbgVb — Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 23, 2024 'ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డూ ప్రసాదాలు, నైవేద్యం పవిత్రతను పునరుద్ధరించడానికి, భక్తుల సంక్షేమానికి శాంతి హోమం ఆగమోక్తంగా జరిగింది. శాంతి హోమం నిర్వహించిన ఆచార్యపురుషుల సూచనల మేరకు శ్రీవారి భక్తులు సాయంత్రం 6 గంటలకు తమ ఇళ్లలో దీపారాధన చేస్తూ "క్షమ మంత్రం" పఠించగలరు' అని టీటీడీ పోస్ట్ పెట్టింది. #tirupati #ttd #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి