Gold Price: బంగారం కొనే వారికి నిజమైన దీపావళి..ఎంత తగ్గిందో తెలుసా! ఈ దీపావళికి బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే వార్త. బంగారం ధర ఏకంగా 490 రూపాయలు కిందకి దిగి..24 క్యారెట్ల బంగారం79,800 రూపాయలుగా ఉంది. By Bhavana 28 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Gold Prices : ఈ దీపావళికి బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే వార్తే ఇది. గత కొంత కాలంగా బంగారం ధరలు పెరుగుతూ..తగ్గుతూ ఊగిసలాడింది. ఈ మధ్య స్వల్పంగా తగ్గుతూ, భారీగా పెరుగుతూ పోయిన బంగారం ధరల ట్రెండ్ నేడు మారింది. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. Also Read: మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే! హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఆదివారం 80,290 రూపాయలుగా ఉంటే సోమవారం 79,800 రూపాయలుగా ఉంది. అంటే.. బంగారం ధర ఏకంగా 490 రూపాయలు కిందకి దిగిందనమాట. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఆదివారం 73,600 ఉండగా, సోమవారం 73,150 రూపాయలుకి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 450 రూపాయలు తగ్గింది. Also Read: మరింత విషమించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం! 10 గ్రాములపై 2890 రూపాయలు.. బంగారం ధర 10 గ్రాములపై దాదాపు 500 రూపాయలు తగ్గినప్పటికీ అక్టోబర్ నెల ఆరంభానికి.. ఇప్పటికీ పోల్చి చూస్తే మాత్రం భారీగానే పెరిగింది. అక్టోబర్ 1న 24 క్యారెట్ల బంగారం ధర 76,910 రూపాయలుగా ఉండగా అక్టోబర్ 28న 79,800 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంటే.. నెల ఆరంభానికి ఇప్పటికీ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 2890 రూపాయలు పెరిగింది. ఒక్క నెలలో బంగారం ధర దాదాపు 3000 రూపాయలు పెరిగే దిశగా ముందుకెళ్తుంది. జూన్, జులై నెలల్లో బంగారం ధరల ట్రెండ్ పరిశీలిస్తే.. ఆ రెండు నెలలు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. Also Read: జనాభా లెక్కలు... 2028లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన! ఆ తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్.. ఇలా వరుసగా మూడు నెలల నుంచి బంగారం ధర పైపైకి పాకుతూనే ఉంది. అక్టోబర్ నెలలో 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పటివరకూ 3.76 శాతం వరకు పెరిగింది. వెండి ధరల్లో మాత్రం సోమవారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది. Also Read: ఏపీలో ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి