Swiggy: ఇటీవల కాలంలో పలు కంపెనీలు దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ప్రముఖ కంపెనీ హ్యుందాయ్ ఇటీవల ఎంట్రీ ఇచ్చింది. త్వరలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మొదటి ఐపీఓ ప్రారంభం కానుంది. స్వీగ్గీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6 నుంచి ప్రారంభం కాబోతుంది.
ఇది కూడా చూడండి: ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త!
కేవలం మూడు రోజులు మాత్రమే..
యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒక రోజు ముందే ఈ ఆఫర్ ప్రారంభం కానుంది. కేవలం మూడు రోజులు మాత్రమే ఈ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. నవంబర్ 8న మళ్లీ ముగిస్తుంది. ఇదిలా ఉంటే స్విగ్గీ ఐపీఓతో దాదాపుగా ఒక రూ.10 వేల కోట్లు సమకూర్చాలని కంపెనీ భావిస్తోంది. కొత్త షేర్ల జారీతో రూ.3750 కోట్ల షేర్లను విక్రయించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.750 కోట్లను సమీకరించాలని స్విగ్గీ భావిస్తోంది.
ఇది కూడా చూడండి: యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసేలా.. అందంతో మెప్పిస్తున్న బ్యూటీ
స్విగ్గీ కంపెనీను బెంగళూరులో 2014లో ఒక చిన్న స్టార్టప్‌గా ప్రారంభించారు. ఈ కంపెనీని ఐపీఓ ద్వారా 15 బిలియన్ డాలర్ల విలువ చేసే కంపెనీగా చేయాలని స్విగ్గీ భావిస్తోంది. లాట్ సైడ్, షేర్ల ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. త్వరలో ప్రకటించే అవకాశముంది. స్విగ్గీ ఐపీఓ ఇంకా మార్కెట్లోకి రాకముందే దాదాపుగా 20 వేల షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
ఇదిలా ఉండగా అక్టోబర్ 15న హ్యుందాయ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మొదలైంది. ఇందులో 18 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఒక్కో షేర్‌ను హ్యుందాయ్ రూ.1,865 నుంచి రూ.1,960గా నిర్ణయించింది. ఒక్క రోజుకే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారత్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌తో ఐపీఓకు రూ.8,315 కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు