Stock Market: 80వేల దిగువకు సెన్సెక్స్..మూడు లక్షల కోట్లు హుష్ కాకి..

ఈరోజు స్టాక్ మార్కెట్ పతనం మదుపర్లకు రక్తకన్నీరు తెప్పించింది. సెన్సెక్స్‌ మళ్లీ 80వేల దిగువ స్థాయికి చేరగా.. మదుపర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు ఒక్క సెషన్‌లో ఆవిరైంది. సెన్సెక్స్ 79,218 దగ్గరా.. నిఫ్టీ 23,951 దగ్గర ముగిసింది.

New Update
Stock Markets:నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా నాలుగో రోజు భారత స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగింపు పలికింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడంతో సెన్సెక్స్ 80 వేల దిగువకు పడిపోయింది. US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించింది. ఇప్పుడు వడ్డీ రేట్లు 4.25% నుండి 4.50% మధ్య ఉండనున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ఈ ఏడాది లో ఇది మూడోసారి. అంతకుముందు, సెప్టెంబర్ 18న ఫెడ్ వడ్డీ రేట్లను 25 (0.25%) ను, అక్టోబర్ 8న  50 బేసిస్ పాయింట్లు (0.50%) తగ్గించింది. అదీకాక వచ్చే ఏడాది అంటే 2025లో మూణ్ణాలుగు రేట్ల కోతలను మార్కెట్లు అంచనా వేయగా.. కేవలం రెండుసార్లు మాత్రమే కోత ఉండొచ్చంటూ ఫెడ్‌ సంకేతాలు ఇచ్చింది.

మూడు లక్షల కోట్లు హుష్ కాకి..

ఇది ఇండియా స్టాక్ మార్కెట్ మీద విపరీతంగా ప్రభావం చూపించింది. దీంతో రోజంతా సూచీలు నష్టాల్లో కదలాడాయి. సెన్సెక్స్‌ మళ్లీ 80వేల దిగువ స్థాయికి చేరగా.. మదుపర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు ఒక్క సెషన్‌లో ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఆ మేర క్షీణించి రూ.450 లక్షల కోట్లకు చేరింది. డిసెంబర్ 18 నాటికి ఇది దాదాపు రూ.452 లక్షల కోట్లు ఉంది. చివరకు రోజు ముగిసేసరికి  964 పాయింట్లు కోల్పోయి సెన్సెక్స్ 79,218 దగ్గరా.. 247 పాయింట్లు క్షీణించి నిఫ్టీ కూడా 23,951 దగ్గరా ముగిసింది. బ్యాంక్, మెటల్, ఐటీ షేర్లు అత్యధికంగా పతనమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్‌, మెటల్‌, ఐటీ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. అయితే, ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.5% కంటే ఎక్కువ లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠ స్థాయి అయిన 85.08 వద్ద ముగిసింది.

Also Read: USA: ముంబయ్ మారణహోమం నిందితుడి పిటిషన్ కొట్టేయాలని కోరిన అమెరికా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు