ఎంప్లాయిస్‌కు గుడ్ న్యూస్.. బాస్‌ను తిట్టేందుకు న్యూ సర్వీస్

కాలిమార్ వైట్ అనే స్టాండప్ కమెడియన్ ఉద్యోగస్తుల కోసం ఓసీడీఏ అనే కొత్త సర్వీస్‌ను యూనైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభించాడు. ఈ సర్వీస్ ద్వారా ఎంప్లాయిస్ బాస్‌ను తిట్టే సదుపాాాయాన్ని తీసుకొచ్చాడు. దీనికి కొంత డబ్బును కూడా ఛార్జ్ చేస్తున్నాడు.

New Update
OCDA

సాధారణంగా బాస్‌లు చాలా సీరియస్‌గా ఉంటారు. కొన్నిసార్లు అయితే ఉద్యోగస్తులకు టార్చర్ చూపిస్తుంటారు. దీంతో బాస్‌ను తిట్టాలని కొందరు ఎంప్లాయిస్‌ భావిస్తారు. కానీ తిడితే ఉద్యోగం నుంచి తీసేస్తారు ఏమోనని భయంతో ఎంత టార్చర్ పెట్టిన కూడా సైలెంట్ ఉంటారు. అయితే ఇలా బాస్‌తో విసిగిపోయిన వారి కోసం ఓ కొత్త సర్వీస్‌ను ప్రారంభించారు.

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

స్టాండప్ కమెడియన్ ఉద్యోగస్తుల కోసం..

యూనైటెడ్ స్టేట్స్‌లో ఓ స్టాండప్ కమెడియన్ ఉద్యోగస్తుల కోసం ఓసీడీఏ అని సర్వీస్‌ను తీసుకొచ్చాడు. కాలిమార్ వైట్ అనే స్టాండప్ కమెడియన్ సోషల్ మీడియా ద్వారా ఈ సర్వీస్‌ను అక్కడి ప్రజలకు అందిస్తున్నాడు. ఈ ఓసీడీఏ వెబ్‌సైట్‌లో ఎవరైనా బాస్‌ను తిట్టాలనుకునేవారు కంప్లైంట్ చేయవచ్చు.

ఇది కూడా చూడండి:  తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక ఏజెంట్ వారి ఇంటికి వెళ్లి ఎందుకు బాస్‌ను తిట్టాలనుకుంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఫిర్యాదు చేసిన వారి నుంచి తీసుకున్న ప్రకారం ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తారు. దాని ప్రకారం బాస్‌ను డైరెక్ట్‌గా లేదా ఫోన్‌కాల్‌లో తిడతారు. ఈ సర్వీస్‌ను సోషల్ మీడియాలో కమెడియన్ అప్‌లోడ్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

ఈ సర్వీస్‌ను ఉచితంగా కాకుండా కొంత డబ్బు ఛార్జ్ చేస్తారు. అయితే ఒకసారి బాస్‌ను తిట్టడానికి ఎంత ఛార్జ్ చేస్తారనే విషయాలు వెల్లడించలేదు. ఇలా బాస్‌ను తిట్టే క్రమంలో ఏం జరిగిన కూడా పూర్తి బాధ్యత అంతా ఏజెంట్ చూసుకోవాలి. 

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు