Stock Market:
రోజూ కంటే ఈ రోజు దేశీ మార్కెట్ షేర్లు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఫైఆన్షియల్, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను కింద దిగజార్చాయి. అమెరికా ఎన్నికలు, ఫెడ్ తన రేట్లప త్వలోనే నిర్ణం ప్రకటించనుండడం లాంటి అంశాలు మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. ఈరోజు మార్కెట్‌లో ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రా షేర్లు బలహీనంగా ఉన్నాయి. ఇవి 8% తగ్గి.. ఒక్కో షేరుకు రూ. 426 చొప్పున NSEలో లిస్టింగ్ అయింది. ఇక BSEలో 7.1% తగ్గింపుతో ఒక్కో షేరుకు రూ. 430.05 వద్ద లిస్ట్ చేయబడింది. దీని ఇష్యూ ధర రూ.463. అయితే, లిస్టింగ్ తర్వాత, దాని షేర్లు పెరిగి రూ. 11.20 (2.42%) పెరిగి రూ.474.20 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ నిఫ్టీ 24,500 దాటితే, అది 24,800 స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇంకాకిందు దిగజారి 23, 50 స్థినికి కూడా చూడవచ్చని చెబుతున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్ల మేర నష్టపోగా.. ఆ తర్వాత కాస్త కోలుకుంది.
ఉదయం స్వల్ప స్టాల్లో మొదలైన సెన్సెక్స్ రోజు ముగిసేసరికి భారీ నష్టాల్లోకి జారుకుంది. దీంతో రోజంతా నష్టాల్లోనే కొనసాగినట్టయింది. ఇంట్రాడేలో 78,232.60 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరికి 941.88 పాయింట్ల నష్టంతో 78,782.24 దగ్గర ఎండ్ అయింది. నిఫ్టీ 309 పాయింట్ల నష్టంతో 23,995.35 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠమైన 84.11 స్థాయికి చేరింది.
ఇది కూడా చదవండి: YCP-Jagan: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్!
భారతీయ కార్పొరేట్ల నుండి నిరుత్సాహకరమైన రెండవ త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ క్షీణతకు దోహదపడుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్‌లో ₹1.2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో నెగిటివ్ సెంటిమెంట్లు ఏర్పడ్డాయి. దీంతో రియల్టీ ఇండెక్స్ 2.93% అతిపెద్ద క్షీణతను పొందింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.48%, నిఫ్టీ మీడియా 2.16% పడిపోయాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్‌ఎంసిజి, మెటల్ ఇండెక్స్‌లు 1% పైగా పడిపోయాయి. హీరో మోటోకార్ప్ షేర్లు 4.25 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: హోంమంత్రి అనితపై పవన్ సీరియస్.. ఇక ఊరుకోనంటూ..