SAMSUNG Galaxy S23 FE: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రకటించింది. ఈ సేల్ సమయంలో పలు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై ఊహకందని డిస్కౌంట్లు ప్రకటించింది. ఇక ఎప్పట్నుంచో తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు గల ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసేవారికి ఈ సేల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ సేల్‌లో శాంసంగ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ (SAMSUNG Galaxy S23 FE) స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిని డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
SAMSUNG Galaxy S23 FE Offer
SAMSUNG Galaxy S23 FE ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.79,999 ధరతో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై 62 శాతం (రూ.50,000) తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో SAMSUNG Galaxy S23 FE ఫోన్ కేవలం రూ.29,999కే అందుబాటులో ఉంది. అంటే దాదాపు సగం కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుందన్నమాట. ఇది మాత్రమే కాదు. దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.2,449కే.. ఎలాగంటే!
ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ట్రాన్సక్షన్‌పై రూ.750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1250 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కొవచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.18,050 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే రూ.11,949కే ప్రీమియం ఫోన్‌ను కొనుక్కోవచ్చు. అయితే ఇంతపెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. పాత ఫోన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండాలి. మోడల్ బట్టి తగ్గింపు నిర్ణయించబడుతుంది.
SAMSUNG Galaxy S23 FE Specifications
దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో వచ్చింది. అవి గ్రాఫైట్, మింట్, పర్పుల్ ఆప్షన్‌లో వచ్చాయి. ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్ + 12 మెగా పిక్సెల్ కెమెరాలను కలిగి ఉంది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 10 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది శామ్‌సంగ్ ఎక్సీనోస్ 2200 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 4500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.