నస్రల్లా మార్గమే నాది కూడా..హెజ్బుల్లా కొత్త ఛీఫ్ మొదటి ప్రసంగం

హెజ్బుల్లా కొత్త ఛీఫ్‌గా సయీం ఖాసిం ఎన్నికయిన తర్వాత ఈరోజు తన మొదటి ప్రసంగాన్ని చేశారు. హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే తాను నడుస్తానని చెప్పారు. షరతుల ప్రకారం అయితే ఇజ్రాయెల్‌త కాల్పుల విరమణకు ఒప్పుకుంటానని ఖాసిం చెప్పారు. 

New Update
Israel

 Hezbollah Cheif Nayeem Khasim: 

నిన్న హెజ్బుల్లా కొత్త ఛీఫ్గా నయీం ఖాసిం ఎన్నికలయ్యారు. ఒక్కోరోజు వ్యవధిలో ఆయన ఈరోజు తన తొలి ప్రసంగాన్ని వినిపించారు. మృతి చెందిన నస్రల్లా దారిలోనే తానూ నడుస్తాననిచెప్పారు ఖాసిం.  ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై జరిగిన డ్రోన్ దాడిలో నెతన్యాహు తప్పించుకున్నారని.. బహుశా అతనికి ఇంకా టైమ్ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. షరతుల ప్రకారమైతే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణను అంగీకరిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన మాజీ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మార్గంలో కొనసాగుతానని నయీం ఖాసిమ్ ప్రతిజ్ఞ చేశారు.

హెజ్బుల్లా కొత్త నాయకుడు నయీం ఖాసిం ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్నరని తెలుస్తోంది. నస్రల్లా చనిపోయిన వెంటనే ఈయన ఇరాన్ పారిపోయినట్లుగా ఆర్తలు వినిపిసతున్నాయి. మరోవైపు హెజ్బుల్లా కొత్త ఛీఫ్‌ను కూడా హతమారుస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఖాసం ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.   నా యుద్ధ వ్యూహాం.. మా నాయకుడు నస్రల్లా యుద్ధ వ్యూహానికి కొనసాగింపే...ఆయన ఏ మార్గంలో అయితే ప్రయాణించాడో తానే అదే మార్గంలో ప్రయాణిస్తానని ఖాసిం చెప్పారు.  లెబనాన్‌కు వ్యతిరేకంగా జియోనిస్ట్ పాలన 39 వేల ఉల్లంఘనలకు పాల్పడింది. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో స్థావరాలను నిర్మించాలని చూస్తోంది. గాజా, లెబనాన్‌లలో ఇజ్రాయెల్ చేసిన హత్యానేరాల్లో అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ రెండూ భాగస్వామిగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్‌ను ఆక్రమించుకుని అరబ్ దేశంలో సెటిల్‌మెంట్లు చేసుకోవాలని యోచిస్తోంది. హెజ్బుల్లా ఇజ్రాయెల్ ఆలోచనలకు అడ్డుగా నిలుస్తోంది. గత నెలల్లో బాధాకరమైన ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రస్తుతం హిజ్బుల్లా గ్రూప్‌ కోలుకుంటోంది. లెబనీస్ నేల నుంచి యూదుల దేశం అత్యవసరంగా ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. నష్టాలను తగ్గించుకోవడానికి మా భూమి నుంచి వెళ్లిపోండి. ఇలాగే ఉండిపోతే.. మీ జీవితంలో ఎన్నడూ చెల్లించని భారీ మూల్యం చెల్లించుకుంటారు. హెజ్బుల్లా రోజులు, వారాలు, నెలల పాటు పోరాటాన్ని కొనసాగించగలదు అని నయీం ఖాసిమ్ హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు