రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సేవల విభాగం కొత్త యాప్‌ను లాంఛ్ చేసింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.. జియోఫైనాన్స్ పేరుతో కొత్త యాప్‌ను విడుదల చేసింది. యూజర్లు దీనిని గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ లేదా మై జియో యాప్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులకు ఆకర్షిణీయమైన ఆఫర్లను జియో ఫైనాన్స్ తీసుకొచ్చింది.
ఇది కూడా చూడండి: Dasara: దసరా రోజు జమ్మిచెట్టును పూజిస్తే కలిగే లాభాలు
ఐదు నిమిషాల్లో అకౌంట్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు జియో ఫైనాన్స్ బీటా వెర్షన్ యాప్‌ను ఈ ఏడాది మే 30వ తేదీన లాంచ్ చేశారు. కానీ పూర్తిస్థాయిలో యాప్‌ను ఇప్పుడు లాంచ్ చేశారు. వినియోగదారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌లో కేవలం 5 నిమిషాల్లో సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్, ఫిజికల్ డెబిట్ కార్డుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు ఖాతాను పొందవచ్చని రిలయన్స్ తెలిపింది.
ఇది కూడా చూడండి: అమ్మకానికి సీఎం రేవంత్ ఫొటో.. ఎందుకో తెలుసా?
ఈ జియో ఫైనాన్స్ యాప్‌తో డిజిటల్ బ్యాంకింగ్, బిల్లుల చెల్లింపు, యూపీఐ లావాదేవీలు జరపవచ్చు. అలాగే మొబైల్ రిఛార్జ్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడంతో పాటు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను కూడా చూసే అవకాశం కల్పిస్తోంది. అలాగే కంపెనీ జీవిత బీమా, ఆరోగ్య బీమా, ద్విచక్ర వాహన బీమా, మోటారు వాహన బీమాను కూడా జియో అందిస్తోంది.
ఇది కూడా చూడండి: దసరా రోజున ఈ పని తప్పక చేయండి.. అంతా మీకు అదృష్టమే!