RBI: 98.04 శాతం.. ఆర్‌బీఐకి చేరిన రూ. 2,000 నోట్లు! రూ. 2,000 నోట్లు 98.04 శాతం బ్యాంకులకు చేరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది. ఇంకా రూ.6,970 కోట్ల విలువైన పెద్ద నోట్లు ప్రజల దగ్గరే ఉన్నాయని తెలిపింది. రూ. 2,000 నోట్లు చలామణిలో లేనప్పటికీ చట్టబద్దంగా వినియోగంలోనే ఉంటాయని స్పష్టం చేసింది. By srinivas 04 Nov 2024 | నవీకరించబడింది పై 04 Nov 2024 21:50 IST in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి RBI: రూ. 2,000 నోట్లు 98.04 శాతం బ్యాంకులకు చేరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది. ఇంకా రూ.6,970 కోట్ల విలువైన నోట్లు ప్రజల దగ్గరే ఉన్నాయిని తెలిపింది. ఆర్‌బీఐ నోట్లను ఉపసంహరించుకునే సమయానికి మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్లు వెల్లడించింది. మార్పిడికి అవకాశం.. ఇక 2023 మే నెలలో ఆర్‌బీఐ పెద్ద నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత దశలవారీగా గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా మొదట అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకు బ్రాంచుల వద్ద నోట్లను డిపాజిట్ లేదా మార్పిడికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఆర్‌బీఐ కార్యాలయాలంలో మార్చుకునే ప్రక్రియను అందుబాటులో ఉంచింది. ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా ఆర్‌బీఐ ఆఫీస్‌కి పంపించవచ్చు. రూ. 2,000 నోట్లు చలామణిలో లేనప్పటికీ చట్టబద్దంగా ఉపయోగంలోనే ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. మే 19, 2023న రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన విషయం తెలిసిందే. #rbi #2000-notes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి