OYO: పేరు మార్చుకున్న ఓయో.. కొత్త పేరేంటో తెలుసా?

హోటల్ రూమ్స్ బుకింగ్స్, ట్రావెల్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఓయో (OYO) కంపెనీ తన కార్పొరేట్ సంస్థ పేరును మార్చింది. రివాజ్ అగర్వాల్ సారథ్యంలోని ఓయో సంస్థ త్వరలో ఐపీఓకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Oyo renames

హోటల్ రూమ్స్ బుకింగ్స్, ట్రావెల్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఓయో (OYO) కంపెనీ తన కార్పొరేట్ సంస్థ పేరును మార్చింది. రివాజ్ అగర్వాల్ సారథ్యంలోని ఓయో సంస్థ త్వరలో ఐపీఓకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఓయో మాతృ సంస్థ అయిన 'ఒరవెల్ స్టేస్' పేరును ఇప్పుడు 'ప్రిజం'గా మార్చినట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ మార్పునకు ప్రధాన కారణం, తమ గ్రూప్ కింద ఉన్న వివిధ వ్యాపారాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం. 'ప్రిజం' పేరు అన్ని రకాల వ్యాపారాలకు (ప్రీమియం హాస్పిటాలిటీ, వెకేషన్ హోమ్స్, పెళ్లి వేదికలు మొదలైనవి) ఒకే గుర్తింపును ఇస్తుందని ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తెలిపారు. ఓయో బ్రాండ్ పేరు యధావిధిగా కొనసాగుతుందని, అది కస్టమర్లకు బడ్జెట్, మిడ్-స్కేల్ ట్రావెల్ సెగ్మెంట్‌లో ప్రధాన గుర్తుగా ఉంటుందని వివరించారు.

ప్రిజం పేరును ఎంపిక చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక పోటీ నిర్వహించగా, దాదాపు 6,000 సూచనల నుంచి ఈ పేరును ఎంచుకున్నట్లు ఓయో వెల్లడించింది. ఐపీఓకు ముందు ఈ పేరు మార్పు, సంస్థ తన విస్తృత పోర్ట్‌ఫోలియో, వ్యూహాత్మక లక్ష్యాలను స్పష్టంగా తెలియజేయడానికి ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఓయో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 35కు పైగా దేశాల్లో సేవలు అందిస్తోంది. ఈ పేరు మార్పుతో అంతర్జాతీయ మార్కెట్లో తమ గుర్తింపును మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisment
తాజా కథనాలు