OnePlus 13: వన్‌ప్లస్ నుంచి తోపు ఫోన్.. బ్యాటరీ హైలైట్!

టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వన్‌ప్లస్ 13 పేరుతో ఓ మొబైల్‌ను అతి పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో తీసుకురానుంది. ఇది 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
OnePlus 13,

 OnePlus 13: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఇప్పటికే తన లైనప్‌లో ఉన్న ఎన్నో మోడళ్లను  కంపెనీ రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు మరొక మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. తన తదుపరి మోడల్ OnePlus 13 మొబైల్‌ని త్వరలో రిలీజ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. 

ఇందులో అతి పెద్ద బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ బ్యాటరీ పరంగా పెద్ద అప్‌గ్రేడ్‌ను పొందుతుందని భావిస్తున్నారు. OnePlus 12లో కూడా కంపెనీ ఇతర బ్రాండ్‌ల కంటే పెద్ద బ్యాటరీని అందించింది. అందువల్ల ఇప్పుడు తన నెక్స్ట్ మోడల్ OnePlus 13 లో కూడా కంపెనీ పెద్ద బ్యాటరీ అందిస్తుందని అంటున్నారు. ఇది సుమారు 6000mAh సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం.

OnePlus 13

OnePlus 13 అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫోన్ లాంచ్ చేయడానికి ఇంకా సమయం ఉండగా.. లాంచ్‌కు ముందే దాని బ్యాటరీ సామర్థ్యం గురించి ఓ లీక్  బయటకొచ్చింది. ఇటీవలే ఈ ఫోన్ చైనా సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కనిపించింది. అందులో ముఖ్యంగా ఈ ఫోన్ బ్యాటరీ గురించి వెల్లడైంది. దాని ప్రకారం.. ఈ ఫోన్ డ్యూయల్ సెల్ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలిసింది. దీని కెపాసిటీ 5,840mAh అని చెప్పబడింది. అంటే 6000mAh బ్యాటరీతో కంపెనీ ఈ ఫోన్‌ని విస్తృతంగా ప్రచారం చేసే  అవకాశం ఉంది.

కాగా గత కొంతకాలంగా OnePlus తన ఫోన్‌లలో బ్యాటరీ సెగ్మెంట్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. మోడల్ మోడల్‌కి కంపెనీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుతోంది. ఇప్పుడు OnePlus 13 ఫోన్ 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 50W మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఫోన్‌లో అందించబడుతుందని సమాచారం.

ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఫోన్‌లో కర్వ్డ్ 2K LTPO డిస్‌ప్లే అమర్చబడుతుందని సమాచారం. ఇది వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు