AP NEWS : ఏపీలో కొత్త మద్యం పాలసీ.. 19న కొత్త దుకాణాలకు నోటిఫికేషన్!

ఏపీలో కొత్త మద్యం పాలసీపై తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 18న జరిగే మంత్రివర్గ భేటీలో నూతన లిక్కర్ విధానానికి ఆమోదం తెలపనుంది. 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీఅ అమల్లోకి రానుంది.

author-image
By srinivas
Liquor
New Update

AP News : ఏపీలో కొత్త మద్యం పాలసీపై తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 18న జరిగే మంత్రివర్గ భేటీలో నూతన లిక్కర్ విధానానికి ఆమోదం తెలపనుంది. మంత్రి వర్గ ఉపసంఘం తమ సిఫార్సులను కేబినెట్ కు సమర్పించనుంది. మద్యం దుకాణాలు..బార్లను గతంలో లాగానే ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పాలసీపై కసరత్తు ఏపీలో అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావటంతో పాటుగా తక్కువ ధరలకే మద్యం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో కొత్త మద్యం పాలసీ పైన కసరత్తు చేస్తోంది .ఇందు కోసం నియమించిన కమిటీ ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను పరిశీలించింది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీఅ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

నూతన మార్గదర్శకాలను ఖరారు..

పాలసీలో భాగంగా మద్యం విక్రయాలు.. ధరలకు నూతన మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. వైసీపీ హాయంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. కూటమి ప్రభుత్వం తిరిగి టెండర్ల ద్వారా బార్లు..మద్యం దుకాణాలను నిర్వహించేలా సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు 18న కేబినెట్ లో నూతన పాలసీకి ఆమోదం తెలిపి..19న కొత్త దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. బార్లు, ధరలకు ఫీజుల పైన తుది కసరత్తు జరుగుతోంది. అదే విధంగా బార్లు, మద్యం దుకాణాలకు ఎంత దూరం ఉండాలి.. ఎలాంటి నిబంధనలు అమలు చేయాలనే దాని పైన ఈ నెల 17న మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో తుది మసాయిదా సిద్దం చేయనున్నారు. విమర్శలకు తావు లేకుండా నోటిఫికేషన్ ఉండాలని భావిస్తున్నారు.

అదే సమయంలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలను తిరిగి రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే బ్రాండెడ్ కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వంలోని మంత్రులు సమావేశమయ్యారు. తక్కవ ధరలకే అమ్మకాల పైన చర్చించారు. తిరిగి రాష్ట్రంలో తమ ఉత్పత్తులను విక్రయించుకొనేలా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని.. వినియోగదారుడి పైన భారం పడకుండా ధరలను ఖరారు చేయాలని సూచించారు. దీంతో, కొంత మేర మద్యం ధరలు తగ్గించి అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం అన్ని అంశాలపైన ఈ నెల 19న స్పష్టత రానుంది.

#ap-cm-chandrababu #ap-liquor-policy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe