మైక్రోసాఫ్ట్‌కి కొత్త CEO ఎవరో తెలుసా?

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కమర్షియల్ బిసినెస్ యూనిట్‌కు జడ్సన్ అల్థాఫ్‌ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బిజినెస్ విజయవంతంగా ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

New Update
_Judson Althoff

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ కమర్షియల్ బిసినెస్ యూనిట్‌కు జడ్సన్ అల్థాఫ్‌ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బిజినెస్ విజయవంతంగా ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన నియామకంతో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సేల్స్ మరింత పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.  అల్థాఫ్ 2013 మార్చిలో మైక్రోసాఫ్ట్‌లో నార్త్ అమెరికా ప్రెసిడెంట్‌గా చేరారు. అప్పటి నుండి ఆయన కంపెనీలో అనేక కీలక విక్రయ మరియు నాయకత్వ పదవులను నిర్వహించారు.

జడ్సన్ అల్థాఫ్ మైక్రోసాఫ్ట్‌లో చాలా ఏళ్లు అనుభవం ఉన్న సీనియర్ వ్యక్తి. ప్రస్తుతం ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు, సేల్స్ ప్లానింగ్, యాక్షన్, ఇన్‌కం జెనరేట్ కావడానికి ఆయనే బాధ్యత వహిస్తున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా ప్రాంతీయ, జాతీయ అనుబంధ సంస్థల్లోని ఎంటర్‌ప్రైజ్, పబ్లిక్ సెక్టార్, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, సేవలు, డెవలపర్ మరియు భాగస్వామ్య కమ్యూనిటీలు ఉన్నాయి. అల్థాఫ్ నాయకత్వంలోనే మైక్రోసాఫ్ట్ కమర్షియల్ క్లౌడ్ ఆదాయం నిరంతరాయంగా పెరుగుతూ వచ్చింది.

Advertisment
తాజా కథనాలు