ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రతన్ టాటా పేరుతో..

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పరిశ్రమ రంగంలో కృషి చేసినందుకుగాను మహారాష్ట్ర ఇండస్ట్రియల్ అవార్డును గతేడాది అందుకున్నారు. మొదటి వ్యక్తి అతను కావడంతో.. ఇకపై రతన్‌టాటా ఉద్యోగ రత్న పేరుతో ఇండస్ట్రియల్ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

New Update
ratan tata Nano

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం దేశవ్యాప్తంగా కలచి వేస్తోంది. పారిశ్రామిక రంగంలో ఈయన చేసిన సేవలు అనంతం. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇండస్ట్రియల్ అవార్డులను రతన్‌టాటా పేరుతో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమ రంగంలో కృషి చేస్తున్న వారికి రతన్‌టాటా ఉద్యోగ రత్న అవార్డు పేరుతో ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇది కూడా చూడండి: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం

ఉద్యోగ్ భవన్‌ పేరు మార్పు..

అలాగే ముంబాయిలోని ఉద్యోగ భవన్‌ని కూడా రతన్ టాటా ఉద్యోగ్ భవన్‌‌గా మారుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే తొలి ఇండస్ట్రియల్ అవార్డును 2023లో మొదటిగా రతన్‌టాటా అందుకున్నారు. అతను అందుకున్న ఈ తొలి అవార్డును ఇకపై అతని పేరుతో ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

ఇది కూడా చూడండి: నేడు దిగ్గజ నటుడు బిగ్‌బీ అమితాబ్ పుట్టిన రోజు

ఇదిలా ఉంటే ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 20, 2024 నాటికి దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు. టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీలు టాటా ట్రస్ట్ కిందకు వస్తాయి, దీని హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్. ఈ సంస్థ తన అన్ని సంస్థల మొత్తం ఆదాయంలో 66 శాతాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు, దేశం, ప్రజల కోసం ఖర్చు చేస్తారు.

ఇది కూడా చూడండి: Insomnia: నిద్రలేమి వల్ల ఈ రోగాల ముప్పు తప్పదు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు