మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? నో టెన్షన్.. ఇలా చేస్తే ఈజీగా దొరికేస్తుంది!

మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? దాన్ని ఎలా పొందాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ వాళ్లు రూపొందించిన CEIR అనే వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ను ఈజీగా పొందొచ్చు.

lost Your Phone
New Update

సాధారణంగా ఈ మధ్య కాలంలో మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా.. ముసలి ముతక తేడా లేకుండా అందరి చేతుల్లోనూ ఫోన్ ఉంటుంది. అందులోనూ చాలా మంది తమ ఫోన్‌ను ఎంతో జాగ్రత్తగా వాడుతుంటారు. ఏ సమస్య వచ్చినా వెంటనే మొబైల్ షాప్‌కు తీసుకువెళ్లి క్లియర్ చేయించుకుంటారు. మరి ఫోనే పోతే.. వారి బాధ వర్ణానాతీతం. ఫోన్ దొంగిలించ బడినా లేదా ఎక్కడైనా పోయినా ప్రాణం పోయేంతగా ఫీలౌతుంటారు. దాన్ని ఎలా కనుక్కోవాలో తెలియక చాలా సఫర్ అవుతుంటారు. ఎన్నో పాత ఫొటోలు, వీడియోలు ఉన్నాయంటూ మొరపెట్టుకుంటారు. అయితే ఇప్పుడు అలా బాధపడాల్సిన పనేలేదు. ఎందుకంటే చాలా ఈజీగా పోయిన ఫోన్‌ను పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇవ్వాలి?

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ వాళ్లు.. CEIR అనే ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఆ వెబ్ సైట్లో పోయిన మీ ఫోన్ వివరాలు రిజస్టర్ చేసి మొబైల్ ‌ఫోన్‌ను ఈజీగా పొందవచ్చు. 

ముందుగా ఫోన్ పోయిన వెంటనే మీ సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కాపీ మీ దగ్గరే ఉంచాలి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసి వారి నుంచి ఒక కాపీ తీసుకోవాలి.  

Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీ ఫోన్ పోయిన వెంటనే ముందుగా సమీపంలోని స్టోర్‌కి వెళ్లి మీ ఫోన్‌ నెంబర్‌‌తో సేమ్ నెంబర్ తీసుకుంటే పాత నెంబర్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు తీసుకున్న కొత్త సిమ్ పాత నెంబర్‌తో యాక్టివేట్ అవుతుంది. 

ముందుగా ఏం చేయాలి?

గూగుల్‌లో CEIR అనే పోర్టల్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ వెబ్‌సైట్ పై క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్‌లు కనిపిస్తాయి. 

అందులో ‘బ్లాక్ స్టోలిన్/లాస్ట్ మొబైల్’ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీ ఫోన్‌కి సంబంధించిన వివరాలు అడుగుతుంది. మొబైల్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, డివైజ్ బ్రాండ్, డివైజ్ మోడల్ వంటివి అడుగుతుంది. అవి ఎంటర్ చేయాలి. అలాగే ఇన్వాయిస్ అని ఉన్న దగ్గర మొబైల్ కొన్నపుడు ఉన్న బిల్ రిసిప్ట్ అప్‌లోడ్ చేయాలి.. లేదంటే లేదు.

ఆ తర్వాత ఎక్కడ పోయింది. మీ రాష్ట్రం ఏది. అలాగే పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన కంప్లైంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే వారిచ్చిన కాపీ కూడా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ ఇన్ఫర్‌మేషన్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

అనంతరం క్యాప్చర్ క్లిక్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత కింద డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఇలా ఇచ్చిన తర్వాత CEIR వాళ్లు ఆ ఇన్ఫర్‌మేషన్ మొత్తాన్ని రిజస్టర్ చేసుకుంటారు. 

ఆ తర్వాత పోయిన ఫోన్‌ను CEIR వారు బ్లాక్ చేస్తారు. అనంతరం ఆ పోయిన ఫోన్లో ఎవరైనా వేరొక సిమ్ వేసి వాడాలని ట్రై చేస్తే CEIR వాళ్లకి, పోలీస్ వాళ్లకి, కంప్లైంట్ ఇచ్చిన వారికి ఆ నెంబర్ వెళ్తుంది. దీంతో పోలీసు వాళ్లు ఆ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు కనుక్కుని ఫోన్‌ను రికవరీ చేసుకుంటారు. 

ఫోన్‌‌ను అన్‌బ్లాక్ చేసుకోవడం

Also Readకుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి

అయితే మీ ఫోన్ అన్‌బ్లాక్ అయిందని బాధపడాల్సిన అవసరం లేదు. అదే CEIR వెబ్‌సైట్లో అన్‌బ్లాక్ యువర్ ఫోన్ మొబైల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మొదట్లో రిజస్టర్ చేసినపుడు ఒక రిక్వెస్ట్ ఐడీ వస్తుంది అది ఎంటర్ చేయాలి. తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం ఫోన్ ఎందుకు అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. దానికి సరైన సమాధానం చెప్పి ఫోన్‌ను అన్‌బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా పోయిన ఫోన్‌ను మళ్లీ తిరిగి పొందొచ్చు. 

#lost-phone-recovery
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe