ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ అధిక ధర కారణంగా కొనేందుకు కొందరు వెనకడుగు వేస్తున్నారు. ఎప్పుడైనా ఆఫర్లు వస్తే అప్పుడు కొనుక్కుందాంలే అని అనుకుంటున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు అతి తక్కువ ధరకే ఐఫోన్ 15ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త సేల్‌ను తీసుకొస్తుంది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా ఓ సేల్‌ను ప్రకటించి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు దీపావళి పండుగ మొదలైంది. దీంతో ఈ పండుగకు వారం ముందుగానే ‘బిగ్ దివాళీ సేల్’ ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 21న ప్రారంభం కాగా.. అక్టోబర్ 31తో ముగుస్తుంది. ఈ సేల్‌లో Apple iPhone 15 పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది.
ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా..
iPhone 15
iPhone 15 అసలు ధర లాంచ్ సమయంలో రూ.69,900గా నిర్ణయించబడింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌పై బిగ్ దివాళీ సేల్‌లో 19 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో iPhone 15 రూ.56,499కి లిస్ట్ అయింది. అంటే దాదాపు రూ.13,401 తగ్గింపు అందింది. అలాగే పలు బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. Flipkart Axis Bank Credit Card పై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఇది కూడా చూడండి: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు..
బ్యాంక్ ఆఫర్లు
అలాగే SBI డెబిట్ కార్డుపై రూ.1500 తగ్గింపు ఈ తగ్గింపుతో రూ.54,999కి కొనుక్కోవచ్చు. ఇది కాకుండా SBI క్రెడిట్ కార్డుపై రూ.3250 తగ్గింపు పొందొచ్చు. ఈ తగ్గింపుతో రూ.53,249కి సొంతం చేసుకోవచ్చు. ఇది కాకుండా SBI Credit Card EMI ట్రాన్సక్షన్‌పై దాదాపు రూ.4500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో ఐఫోన్ 15ను రూ.51,999లకే కొనుక్కోవచ్చు.
ఇది కూడా చూడండి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్!
ఎక్స్ఛేంజ్ ఆఫర్
ఇది కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.33,700 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ తగ్గింపుతో కేవలం రూ.22,799లకి లభిస్తుంది. అయితే ఇంత మొత్తంలో డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. దీంతో ఓ వైపు బ్యాంక్ డిస్కౌంట్, మరో వైపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో చాలా తక్కువకే iPhone 15 ను కొనుక్కోవచ్చు.