METRO : హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ప్రణాళిక సిద్ధమైంది. సెకండ్ ఫేజ్‌లో మొత్తం 116.2 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించనుండగా.. ఇందుకు సంబంధించి అధికారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విస్తారణకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందే ఆమోదం తెలుపగా.. సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.32 వేల 237 కోట్లు వ్యయం కాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.
భూగర్భంలో మెట్రో ప్రయాణం..
ఈ మేరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో సెకండ్ ఫేజ్ పనులు నిర్వహించనున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులతోపాటు ఆరాంఘర్-బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్‌పోర్టుకు వరకూ మెట్రో సేవలు అందించనున్నారు. కారిడార్ - 4 నాగోల్ - శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్లు కొనసాగనుంది. ఈ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ మేర భూగర్భంలో మెట్రో ప్రయాణించనుంది. కారిడార్ -5లో రాయ్‌దుర్గ్ - కోకాపేట్ నియోపోలిస్ - 11.6 కి.మీ, కారిడార్ -6 MGBS - చాంద్రాయణగుట్ట - 7.5 కి.మీ, కారిడార్ -7 మియాపూర్ - పటాన్‌చెరు - 13.4 కి.మీ, కారిడార్ -8 ఎల్బీనగర్ - హయత్‌నగర్ - 7.1 కి.మీ, కారిడార్ -9 ఎయిర్‌పోర్టు - ఫోర్త్ సిటీ - 40 కిలోమీటర్లు విస్తరించనుంది.
Also Read : నెయ్యిలో కల్తీ జరిగింది అప్పుడేనా?: సిట్ విచారణలో సంచలన విషయాలు