/rtv/media/media_files/2025/05/19/WDsqRMKTnzQ7r9br65Lq.jpg)
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా అనేక బ్యాంకులు ఇటీవల హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. తాజాగా కెనరా బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.80% కు తగ్గించింది. ఈ క్రమంలో ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకునే వారు ఏ బ్యాంకు నుండి లోన్ తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోండి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను 0.25%-0.25% తగ్గించింది. అంటే ఈ సంవత్సరం రెపో రేటు 0.50% తగ్గించబడింది. ఈ కారణంగా బ్యాంకులు కూడా రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. హోమ్ లోన్ తీసుకునేవారు ఈ మూడు విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
1. ముందస్తు చెల్లింపు జరిమానా
చాలా బ్యాంకులు గడువుకు ముందే లోన్ చెల్లించినందుకు కూడా జరిమానా విధిస్తాయి. ఎందుకంటే గడువుకు ముందే రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు, బ్యాంకులు ఊహించిన దానికంటే తక్కువ వడ్డీని పొందుతాయి కాబట్టి. అటువంటి పరిస్థితిలో వారు కొన్ని నిబంధనలు, షరతులు విధిస్తారు. కాబట్టి హోమ్ లోన్ తీసుకునేటప్పుడు, దీని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.
2. CIBIL స్కోర్ చెక్
మీ CIBIL స్కోర్‌ను జాగ్రత్తగా చూసుకోండి CIBIL స్కోర్ ఒక వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ చరిత్రను వెల్లడిస్తుంది. వ్యక్తిగత రుణాల విషయంలో, బ్యాంకులు ఖచ్చితంగా CIBIL స్కోర్‌ను పరిశీలిస్తాయి. ఇందులో మీరు ఇంతకు ముందు మీరు లోన్ తీసుకున్నారా లేదా మీరు క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగించారో తెలుసుకోవచ్చు. క్రెడిట్ స్కోరు 300-900 వరకు ఉంటుంది, 700 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే లోన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
3. ఆఫర్లు ఏంటో తెలుసుకోండి
బ్యాంకులు ఎప్పటికప్పుడు లోన్ తీసుకునేవారికి మెరుగైన ఆఫర్లను అందిస్తూనే ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, రుణం తీసుకునే ముందు, మీరు అన్ని బ్యాంకుల ఆఫర్ల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే తొందరపడి లోన్ తీసుకుంటే ఇబ్బంది పడుతారు కాబట్టి లోన్ తీసుకునే ముందు అన్ని బ్యా్ంకుల్లో లోన్, వడ్డీ రేట్లను తెలుసుకోవడం మంచింది.
20 సంవత్సరాల కాలానికి రూ. 30 లక్షల రుణంపై EMI లెక్కలు ఈ విధంగా
8% కంటే తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ అందించే బ్యాంకులు ఇవే