GST On Car-Bikes: కేంద్రం దీపావళి సర్‌ప్రైజ్.. కారు కొనేవారికి పండగే పండగ..

కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీ రేటును 28% నుంచి 18%కి తగ్గించింది. ఈ నిర్ణయంతో 4 మీటర్ల లోపు ఉన్న పెట్రోల్, డీజిల్ కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. సెప్టెంబర్ 22 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. అందులో మారుతి సుజుకి ఆల్టో, టాటా నెక్సాన్ ఉన్నాయి.

New Update
GST Tax Slabs Changes

GST Tax Slabs Changes

దీపావలి పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. సామాన్య ప్రజలకు అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గించింది. ఇప్పటి వరకు ఉన్న 28 శాతం జీఎస్టీ.. ఇకపై సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 18 శాతానికి అందుబాటులోకి రాబోతుంది. 

GST On Car-Bikes

ఇందులో భాగంగా బుధవారం ఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన రెండు రోజుల GST కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా 5%, 18% అనే రెండు శ్లాబ్‌లు మాత్రమే GSTలో ఉంటాయి. సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. చిన్న కార్లు, 350 సిసి వరకు మోటార్ సైకిళ్ళు, త్రీ వీలర్లు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్స్‌లపై జీఎస్టీని 28% నుండి 18%కి తగ్గించినట్లు చెప్పారు. 

ఈ తగ్గించిన కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి వర్తిస్తాయని తెలిపారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ హైబ్రిడ్ కార్లపై భారీ ఉపశమనం లభించింది. గతంలో వాటిపై 28% GST ఉండేది.. కానీ ఇప్పుడు అవి 18% GST పరిధిలోకి రానున్నాయి. అయితే పెట్రోల్ వాహనాల ఇంజిన్ సామర్థ్యం 1,200 సిసి, పొడవు 4,000 మిమీ కంటే తక్కువ ఉండాలి. 

అదే సమయంలో డీజిల్ ఇంజిన్ల సామర్థ్యం 1,500 సిసి, పొడవు 4,000 మిమీ కంటే తక్కువ ఉండాలి. కాగా ఆటో పరిశ్రమలో ఎక్కువ భాగం 1,200 సిసి నుండి 1,500 సిసి ఇంజిన్ సామర్థ్యం గల వాహనాలే ఉన్నాయి. అందులో మారుతి సుజుకి ఆల్టో, థార్, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ ఐ10, ఐ20, వెన్యూ, ఆరా వంటి కార్లు ఉన్నాయి. కానీ 1,200 సిసి నుండి 1,500 సిసి ఇంజిన్ సామర్థ్యం కంటే ఎక్కువగా ఉన్న వాహనాల జీఎస్టీలో ఎలాంటి మార్పు లేదు. అలాంటి వాహనాలు 40 శాతం జీఎస్టీ పరిధిలోనే ఉంటాయి. 

అలాగే టూ వీలర్ వాహనాల విషయానికొస్తే.. కేంద్ర ప్రభుత్వం 350 సిసి వరకు మోటార్ సైకిళ్లపై 28% GSTని 18%కి తగ్గించింది. ఇందులో హీరో స్ప్లెండర్ నుండి హోండా షైన్, బజాజ్ పల్సర్, KTM డ్యూక్, TVS అపాచీ వరకు అనేక మోడళ్లు ఉన్నాయి. అయితే 350 సిసి కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న అన్ని ద్విచక్ర వాహనాలు ఇప్పుడు 40% పన్ను స్లాబ్ కిందకు వస్తాయి. 

వీటన్నింటితో పాటు మరీ ముఖ్యంగా రైతులకు భారీ ఉపశమనం లభించింది. ట్రాక్టర్లు, నేల తయారీ, వ్యవసాయ సంబంధిత యంత్రాలు, కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, గడ్డి, మేత ప్యాకింగ్ యంత్రాలు, గడ్డి విత్తే పరికరాలు, ఎండుగడ్డి తరలింపు యంత్రాలు, కంపోస్టింగ్ యంత్రాలు, ఇతర వ్యవసాయం, ఉద్యానవన సంబంధిత యంత్రాలు 12% బదులుగా 5% GSTని కలిగి ఉంటాయి. ఇది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని చాలా మంది వాహన కొనుగోలుదారులకు ప్రయోజనం చేకూరనుంది. 

Advertisment
తాజా కథనాలు