దసరా వేళ తప్పిన భారీ ప్రమాదం!

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం NH-16పై బస్సును 10 మంది భవాని భక్తులతో వెళ్తున్న కారు ఢీకొట్టింది. కార్‌ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా కారులో ఉన్న భక్తులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

New Update
east accident

Accident:

దసరా పండుగ దినాన తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది.  జగ్గంపేట మండలం రామవరం NH-16పై బస్సును భవాని భక్తుల కారు డీకొట్టింది. కారులో విజయవాడ వెళ్తున్న భవాని భక్తుల కారు రామవరం దగ్గర బలంగా బస్సును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న భవాని భక్తులకు గాయాలయ్యాయి. కార్‌ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. స్వల్ప గాయాలతో భవాని భక్తులు బయటపడ్డారు. కారులో నుంచి భక్తులను ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరగడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు