Budget 2026: బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం ధరలు.. ఇవే కారణాలు!

కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు బడ్జెట్ నిర్ణయాలు భారీగా బ్రేక్ వేశాయి. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి.

New Update
Gold prices

కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటనల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు బడ్జెట్ నిర్ణయాలు భారీగా బ్రేక్ వేశాయి. ముఖ్యంగా దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. 

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.2,000 నుండి రూ.3,500 వరకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పటికీ, దేశీయంగా పన్నుల తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపించింది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తూ కిలోకు భారీగా ధర తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల సామాన్యులకు ఊరటనిస్తోంది. గత కొంతకాలంగా 10 గ్రాముల బంగారం రూ. 80,000 మార్కును దాటుతుందన్న భయాల మధ్య, ఈ ఒక్కరోజులోనే భారీగా తగ్గడం విశేషం. బడ్జెట్ ప్రభావంతో కిలో వెండి ధర రూ. 90,000 - రూ.95,000 స్థాయి నుండి ఒక్కసారిగారూ. 75,000 - రూ. 80,000 శ్రేణికి దిగివచ్చింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి ధర కిలోకు సుమారు రూ. 15,000 నుండి రూ. 26,000 వరకు పడిపోయింది.

ధరల పతనానికి ప్రధాన కారణాలు:

కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇది నేరుగా వినియోగదారుల వద్దకు వచ్చే ధరను భారీగా తగ్గించింది.

బడ్జెట్ నిర్ణయాలు: పెట్టుబడి మార్గాల్లో మార్పులు, ఇతర ఆర్థిక సంస్కరణల కారణంగా ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడులను మళ్లించడం కూడా ధరల తగ్గుదలకు కారణమైంది.

Advertisment
తాజా కథనాలు