Gold Prices: బంగారం కొనాలుకుంటున్న వారికి గత కొన్ని రోజులుగా షాకులు తగులుతునే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ఈ నెలలోనే రూ. 7 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జులై బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం..బంగారం , వెండి ఆభరణాలపై కస్టమ్స్ డ్యూటీ భారీగా తగ్గించడంతో రేట్లు భారీగా పతనం అయ్యాయి.
దేశీయంగా బంగారం రేట్ల విషయానికి వస్తే.. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి తులం రూ. 71 వేల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతకుముందు కూడా వారంలో రూ. 2350 ఎగబాకింది. 10 రోజులుగా అసలు రేటు తగ్గలేదు. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాములకు ఇది రూ. 77,450 వద్ద ఉంది. ఇవే ఆల్ టైమ్ హైయెస్ట్ ధరలు కావడం గమనార్హం.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 400 పెరిగి 10 గ్రాములు రూ. 71,150 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,600 గా ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా ముందుకు దూసుకెళ్లాయి. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1000 పెరిగి రూ. 96 వేల మార్కుకు చేరింది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా రూ. 1000 పెరిగి.. కిలో వెండి ధర రూ. 1,02,000 వద్ద ఉంది.
Also Read: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా కుమార్తె మృతి