కొత్త గరిష్టాలకు చేరుకున్న బంగారం

అస్సలు తగ్గేదేల్యా అంటూ బంగారం పరుగులు పెడుతోంది. ఈరోజు 250 రూపాయిలు పెరిగి..కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర 78, 700 రూ.లు ఉంది. 

author-image
By Manogna alamuru
Gold and Silver: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే.. 
New Update

Gold Rates Are High: 

ఆభరణాల వ్యాపారుల నుంచి స్థిరమైన కొనుగోళ్ళు...విదేశీ మార్కెట్లలో బంగారం రేట్లు స్థిరంగా ఉండడంతో దేశీ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఒక్కసారే 250 రూపాయలు అమాంతం పెరిగిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 78,700 రూపాయలకు పెరిగిపోయింది.  మరోవైపు వెండి ధరలు కూడా ఆకాశాన్ని చూస్తున్నాయి. కిలో వెండి రూ.94,200 నుంచి రూ.200 తగ్గి రూ.94,000కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 

ఇక 22 క్యారెట్ల బంగారం కూడ 200రూ. పెరిగి 10యగ్రాముల బంగారం ధర 78, 300 దగ్గర స్థిరపడింది. దేశీయంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచిడిమాండ్ పెరగమ బంగారం ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇక యూఎస్‌లో ద్రవ్యోల్బణం వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో అక్కడ బంగారలో చాలా స్వల్పంగా ట్రేడింగ్ జరుగుతోంది. దీని కారణంగా కూడా ఇండియాలో బంగారం రేట్లు పెరిగాయి. 

Also Read: Japan Airways: విమానంలో అడల్ట్ సినిమా..ప్రయాణికుల పాట్లు

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe