Japan Airways: విమానంలో అడల్ట్ సినిమా..ప్రయాణికుల పాట్లు పాపం ఏదో చేద్దామనుకుంటే మరేదో అయింది. ప్రయాణికులను ఎంటర్టైన్ చేద్దామని అనుకుంది ఆస్ట్రేలియా నుంచి జపాన్ వెళుతున్న క్వాంటస్ ఎయిర్ వేస్. ప్రయాణికుల కోసం అడల్ట్ కంటెంట్ సినిమా వేసింది. కానీ అది ఆఫ్ అవ్వక మహిళలు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. By Manogna alamuru 07 Oct 2024 | నవీకరించబడింది పై 07 Oct 2024 18:45 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Australia to japan Flight: ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలు రోజులు, గంటలు ఉంటాయి. సాధారణంగా ఏ దేశం నుంచి ఏ దేశం వెళ్ళాలన్నా...ఎంత పక్క కంట్రీనే అయినా.. హాఫ్ డే కచ్చితంగా పడుతుంది. అందుకే ఈ ఫ్లైట్లలో ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు టీవీ స్క్రీన్లు ఉంటాయి. వీటిల్లో వారికి నచ్చిన సినిమాలు లేదా వీడియోలు పెట్టుకుని చూసుకోవచ్చును. సాధారణంగా విమానయాన సంస్థే అన్ని భాషలకు సంబంధించి కంటెంట్‌ను సెలెక్ట్ చేసి పెడుతుంది. ఒకవేళ మనకు వద్దు అనిపిస్తే హాయిగా టీవీ ఆఫ్ చేసి పడుకోవచ్చు కూడా. ఇది అందరికీ తెలిసిందే. చాలా మంది ఒక్కరోజులో రెండు, మూడు సినిమాలు చూసి...తమ విమాన ప్రయాణంలో ఎంజాయ్ చేస్తారు. అయితే ఆస్ట్రేలియా నుంచి జపాన్ వెళుతున్న విమానం క్వాంటస్ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల గురించి ఎక్కువ ఆలోచించింది. వారిని బాగా ఎంటర్టైన్ చేద్దామనుకుని ఒక అడల్ట్ సినిమా ఆటో మేటిక్‌గా అందరికీ వచ్చేలా సెట్ చేసి పెట్టేసింది. ఇది అచ్చంగా పెద్దలు మాత్రమే చూసే సినిమా. ఇంత వరకు బాగానే ఉంది. కానీ వాళ్ళ ఐడియా పాపంమొత్తానికే బెడిసి కొట్టింది. ఫ్లైట్‌లో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ సినిమా వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా పిల్లలు చూడకూడదని చాలా మంది ఆ అడల్ట్ కంటెంట్ మూవీని ఆపేద్దామనుకున్నారు. అదిగో అక్కడ మొదలైంది అసలు సమస్య. ఎంత ప్రయత్నించినా టీవీలు ఆగలేదు. కరికి కాదు ఇద్దరికి కాదు మొత్తం విమానంలో ఉన్న అందరికీ ఇదే సమస్య తలెత్తింది. అప్పుడు ఏంటా అని చూస్తే...ఫ్లైట్లో సాంకేతిక సమస్య తలెత్తి అసలు టీవీల ఆఫ్ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. దీంతో ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు. అయితే చివరకు విమాన సిబ్బంది కష్టపడి...టీవీలను ఆపగలిగారు. కానీ అది జరిగే వరకూ మాత్రం ప్రయాణికులు కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరైతే వద్దని కోరారో అక్కడి స్క్రీన్లలో చిత్రం రాకుండా చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినా అది ఫలించలేదు. చివరకు ఎలాగోలా ఆ చిత్రాన్ని నిలిపివేసి దానికి బదులు పిల్లలకు ఇష్టమైన మరో సినిమాను ప్రదర్శించినట్లు ఎయిర్‌లైన్స్ చెప్పింది. ఈ అసౌకర్యానికి క్షమించాలంటూ క్వాంటాస్ ఓ ప్రకటనలో తెలిపింది. విమానంలో ప్రదర్శించిన చిత్రం అందరికీ సంబంధించిన కాదని అర్థమైంది. ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న ప్రతి ప్రయాణికుడికి మేం క్షమాపణలు చెబుతున్నాం... వెంటనే సినిమాను మార్చేసి వేరొక దాన్ని ప్రదర్శించాం. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఇదంతా సాంకేతిక సమస్య వల్లే ఎదురైందని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. Also Read: ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనేసిన అమెజాన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి