Gold and Silver Rates:
రీసెంట్‌గా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఎంత పెరిగినా తగ్గేదల్యా అన్నట్టు వినియోగదారులు కొంటున్నారు. అందుకే బంగారం ధరలు కూడా తగ్గేదేల్యా అంటూ ఆకాశాన్ని తాకాయి. కానీ ఈరోజు మాత్రం పసిడి, వెండి ధరలు కాస్త కనికరం చూపెట్టాయి. ఈరోజు ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1300 మేర తగ్గి రూ.81,100కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 82,400రూ.లు గా ఉంది.
మరోవైపు రీసెంట్‌గా లక్ష రూపాయల మార్కు దాటిన కిలో వెండి ధర కూడా దిగొచ్చింది. గత వార వెండి కిలో రూ.99,500 పలకగా.. దీ రోజు రూ.4600 తగ్గి రూ.94,900కు చేరింది. బంగారం వర్తకులు, రిటైలర్ల నుంచి ఆశించిన మేర డిమాండ్ లేకపోవడంతో బంగారం, వెండి ధరల తగ్గుముఖం పట్టడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు 2740 డాలర్ల వద్ద కొసాగుతుండగా.. వెండి ఔన్సు 32.80 డాలర్లుగా ఉంది.
Also Read: AP: 2029 నాటికి అర్హులందరికీ ఇళ్ళు – సీఎం చంద్రబాబు