AP: 2029 నాటికి అర్హులందరికీ ఇళ్ళు – సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 2029 నాటికి అందరికీ ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంతో పని చేయాలని ఏపీ సీఎ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభానికి కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. By Manogna alamuru 04 Nov 2024 in విజయవాడ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AP CM Chnadra babu: ముఖ్యమంత్రి చంద్రబాబు...ఏపీ సెక్రటేరియట్ గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన వాళ్లందరికీ ఇళ్ళు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక పీఎంఏవై అర్బన్ కింద 58,578 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. లక్ష ఇళ్లు డిసెంబరు నాటికి పూర్తవుతాయని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. 2026 నాటికి మరో 7.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డ్రోన్ల ద్వారా ఇళ్ల నిర్మాణ నాణ్యత, కొలతలు తీసుకునేందుకు గృహనిర్మాణ శాఖ పైలట్ ప్రాజెక్టు చేపట్టిందని అధికారులు వివరించారు. ఇదే సాంకేతికతను పెద్ద లేఅవుట్లలో కూడా వినియోగించాలని సీఎం సూచించారు. వ్యవసాయ శాఖతో సమీక్ష అలాగే మరోవైపు వ్యవసాయ మీద సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. రైతును నిలబెట్టి, సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. నాడు ఐటీ ఎలా అయితే గేం ఛేంజర్ అయ్యిందో...రానున్న రోజుల్లో పకృతి వ్యవసాయం కూడా గేం ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకృతి సేద్యంలో ఎపి పయనీర్ గా నిలవాలని....దీనికి టెక్నాలజీని జోడించడం ద్వారా అనూహ్య, అద్భుత ఫలితాలు సాధించవచ్చని సిఎం అన్నారు. ప్రకృతి సేద్యం - అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఎపి వ్యవసాయ రంగంలో దిక్సూచి అయ్యేలా చేయాలని...అందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేయాలని సిఎం ఆదేశించారు. ఖర్చులు గణనీయంగా పెరిగి రైతులకు సాగు భారంగా మారిన పరిస్థితుల్లో టెక్నాలజీ ద్వారా ఆ ఖర్చులు తగ్గించాలని అన్నారు. పంటల సాగులో డ్రోన్ల వాడకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పంటల సాగుకు 40 వేల డ్రోన్లు అవసరం పడతాయని అధికారులు వివరించారు. సాగులో డ్రోన్లకు కేంద్ర ప్రభుత్వం రూ.8 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందని.... తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కూడా కల్పిస్తుందని...ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సిఎం సూచించారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు డ్రోన్ లపై శిక్షణ ఇచ్చి డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దితే ఇదొక కుటీర పరిశ్రమ అవుతుందన్నారు. ప్రజలు పకృతి సేద్యం లాభాల గురించి తెలుసుకునేలా చేయాలని సిఎం చెప్పారు. అంతకుముందు అధికారులు పంట ఉత్పత్తుల పెంపు, సాగు విస్తీర్ణం పెంపు, భూసార పరీక్షలు వంటి అంశాల్లో తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా భూసార పరీక్షలు చేసి రైతులకు అవసరమైన పోషకాలు అందించే పరిస్థితి రావాలని సిఎం అన్నారు. జూలై నెలలో జరిగిన పంటనష్టానికి సంబంధించి రూ.37 కోట్లు రైతులకు పరిహారం కింద చెల్లించాల్సి ఉందని అధికారులు చెప్పగా...ఆ నిధుల విడుదలకు సిఎం అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదలతో రైతుల పంటనష్టానికి గాను రూ.319 కోట్లు నెలరోజుల వ్యవధిలోనే చెల్లించినట్లు అధికారులు తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల ప్రకారం ఈ రబీ నుంచి పాత పద్దతిలో క్రాప్ ఇన్స్యూరెన్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు. Also Read: Uttar Pradesh: ఆగ్రా లో కూలిన మిగ్–29 విమానం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి