ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం బెంగళూరు ప్రజలకు మాత్రమే. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్‌లో భాగంగా రూ.1 కే ఆటో రైడ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీనికోసం స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లతో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం ఒక్క రూపాయితో బెంగళూరు మొత్తం చుట్టేయవచ్చు. రుపాయికే ఆటో బుక్ చేసుకుని నగరంలో ఎక్కడికైనా, ఎంతదూరమైన వెళ్లవచ్చు.
ఇది కూడా చూడండి: సత్తాచాటిన తండ్రీ కొడుకులు.. కుటుంబమంతా ప్రభుత్వ ఉద్యోగులే!
రూ.1కి ఏం లభిస్తుంది
ఈ ఆటో రైడ్‌లు కోసం ప్రజలు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాల్లో కంపెనీ స్టాళ్లను కూడా ఏర్పాటు చేసింది. రూ.1కే ఫ్లిప్‌కార్ట్ ఆటో రైడ్‌లు అందించడంతో చాలా మంది ప్రజలు ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటున్నారు. క్యాష్‌లెస్ సేవలు, రద్దీగా ఉండే సమయంలో సులభ ప్రయాణాల కోసం ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించింది. అసలు రుపాయికి ఏం లభిస్తుంది? కానీ ఫ్లిప్‌కార్ట్ సౌకర్యంగా, చౌకగా ఉంటుందని అనడానికి ఈ ప్రచారం నిదర్శనమని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ వరకు మాత్రమే ఉంటుంది.
ఇది కూడా చూడండి: Punjab: ముగ్గురు దొంగలను సింగిల్ హ్యాండ్ తో ఆపిన సూపర్ ఉమెన్!
ఈ ఆఫర్‌పై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. గర్ల్‌ఫ్రెండ్ నుంచి రిప్లై రావడం కంటే ఈ రూ.1కి ఆటో రైడ్ కష్టమని ఇది అసాధ్యమని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఇకపై ఫ్లిప్‌కార్ట్ యూపీఐ వచ్చేసింది. ఆటోరైడ్‌లు క్యాన్సిల్ గురిచి అసలు ఆలోచించవలసిన అవసరం లేదని కామెంట్ చేశారు. మరికొందరు ఈ బంపర్ ఆఫర్ బెంగళూరు ప్రజలకే ఎందుకు ప్రకటించారు. మిగతా సిటీలో ఇవ్వకపోవడానికి మేం ఏం తప్పు చేశామని అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బంఫర్ ఆఫర్ సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: బయలుదేరిన కొన్ని క్షణాలకే కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం