సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. 4 నెలలకే పంట, వెండిని మించిన ధర!

తెలంగాణ సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కశ్మీర్‌లోనే పండే ఈ పంటను DXN అనే కంపెనీ మందపల్లి గ్రామంలో కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి పంట సాగు చేస్తూ లాభాలు గడిస్తోంది. తులం కుంకుమ పువ్వు రూ.300 ధర పలుకుతున్నట్లు తెలిపారు. 

sd
New Update

Siddipet: తెలంగాణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు చేస్తూ పలువురు రైతులు ఔరా అనిపిస్తున్నారు. శీతల వాతావరణం ఉండే కశ్మీర్ లోనే పండే కుంకుమ పువ్వు పంటను తెలంగాణలోనూ పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఈ మేరకు ఎన్నో ఔషధ గుణాలుండే పవ్వును కృత్రిమ వాతావరణం సృష్టించి సిద్ధిపేటలో సాగు చేస్తున్నారు. 

కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి..

పూర్తి వివరాల్లోకి వెళితే.. మందపల్లి గ్రామంలోని డీఎక్స్‌ఎన్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ ఇండియా కంపెనీ తెలంగాణలోనే అతిపెద్ద ఇండోర్‌ కుంకుమ పువ్వు సాగుపై ప్రదర్శన నిర్వహించింది. DXN అనే కంపెనీ కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి కుంకుమ పువ్వును సాగు చేస్తోంది. కశ్మీర్‌ నుంచి సాఫ్రాన్ విత్తనాలు తీసుకువచ్చిన నిర్వాహకులు.. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రత్యేకంగా ఒక కోల్డ్ రూమ్ ఏర్పాటు చేసి పంట సాగు చేస్తోంది. ఒక ఎకరం పొలంలో పండించే పంటను ఒక రూమ్ లో పండించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు కేవలం నాలుగు నెలల కాలవ్యవధిలో పంట చేతికి వస్తుందని, కశ్మీర్ లో పండే పంటకంటే కోల్డ్ రూమ్ లో పండించే కుంకుమపువ్వుకు భారీ డిమాండ్ ఉందని చెబుతున్నారు. ఎక్కువ సువాసన కలిగి ఉండటంతో మార్కెట్లో డిమాండ్ పెరిగిందని, ఒక తులం కుంకుమ పువ్వు రూ.300 ధర పలుకుతున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: మూసీ నిర్వాసితులకు మెరుగైన పరిహారం.. సీఎం రేవంత్ ప్రెస్-LIVE

ఇది కూడా చదవండి: IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు

మార్కెట్లో భారీ డిమాండ్.. 

'మందపల్లి గ్రామంలోని డీఎక్స్‌ఎన్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ ఇండియా కంపెనీ తెలంగాణలోనే అతిపెద్ద ఇండోర్‌ కుంకుమ పువ్వు సాగుపై ప్రదర్శన నిర్వహించింది. పరిశ్రమ ప్రముఖులు, వ్యవసాయ నిపుణుల ఆధ్వర్యంలో కుంకుమ పువ్వు సాగు ప్రదర్శన నిర్వహిణ జరిగింది. కుంకుమ పువ్వు పెంపకం ప్రక్రియను, కుంకుమ పువ్వు ధారాల సేకరణలో ఆధునిక పద్ధతులను వివరించారు. కుంకుమ పువ్వు పంట సాగు చేస్తే లాభాలు ఉంటాయి. వరి, మొక్కజొన్న లాగా ఎక్కడ పడితే అక్కడ పండదు. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లోనే కుంకుమ పువ్వు సాగు చేసే అవకాశం ఉంటుంది. కశ్మీర్‌ లాంటి అత్యంత చల్లటి ప్రదేశాల్లోనే ఈ కుంకు పువ్వు సాగు అవుతుంది. ఇంతటి ప్రత్యేకత ఉంది కాబట్టే దీనికి డిమాండ్ ఎక్కువ. త్వరలోనే మష్రూమ్ కల్టివేషన్ ప్రాజెక్టు కూడా చేపట్టబోతున్నాం' అని డిఎక్స్ ఎన్ కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: TGPSC GROUP 1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు!

ఇది కూడా చదవండి: 12 ఏళ్ళ తర్వాత తల్లి కాబోతున్న బాలయ్య హీరోయిన్.. బేబీబంప్ ఫొటోలు వైరల్

#siddipet #saffron-flower
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe