BSNL: సంచలనం.. భారీగా పెరిగిన సబ్‌స్క్రైబర్లు, ఎన్ని లక్షలంటే?

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLకు మంచి రోజులొచ్చాయి. బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ బేస్ గత రెండు నెలల్లో పెరుగుతూ వచ్చింది. జూలైలో దాదాపు 30 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది. అదే సమయంలో ఆగస్టులో 25 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది.

New Update
BSNL

ఈ ఏడాది జూలైలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో సహా వొడాఫోన్ ఐడియా వంటి అగ్ర టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో BSNL ముందుకు వచ్చింది. ఇదే సరైన అవకాశంగా భావించి అతి తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఇది కూడా చదవండి: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!

BSNLకు లక్షల్లో సబ్‌స్రైబర్లు

ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటించి ఇతర నెట్‌వర్క్ యూజర్లను అట్రాక్ట్ చేసింది. దీంతో BSNLకు లక్షల్లో సబ్‌స్రైబర్లు వచ్చారు. టెలికాం రెగ్యులేటర్ TRAI నివేదిక ప్రకారం.. BSNL ఆగస్టులో దాదాపు 25 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. మరోవైపు ఎయిర్‌టెల్  24 లక్షల మంది, రిలయన్స్ జియో 40 లక్షల మంది, వొడాఫోన్ ఐడియా 19 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. 

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు

కాగా BSNL జూలైలో కూడా దాదాపు 30 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది. అయితే ఎన్ని లక్షల మంది సబ్‌స్రైబర్లు వచ్చినా.. కంపెనీ మార్కెట్ వాటా ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. అందులో రిలయన్స్ జియో మార్కెట్ వాటా 40.5 శాతం కాగా, ఎయిర్‌టెల్ మార్కెట్ వాటా 33 శాతం, వొడాఫోన్ ఐడియా వాటా 18శాతంగా ఉంది. ఈ మార్కెట్‌లో BSNL వాటా కేవలం 7.8 శాతంగా నిర్ణయించబడింది. ఇక ఇప్పుడు తక్కువ టారిఫ్‌ల కారణంగా కంపెనీ ఎక్కువ మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను పొందుతోంది.

ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? 

ఈ నేపథ్యంలో BSNL సిమ్ కార్డులను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఏటీఎం వంటి మెషీన్లను అమర్చాలని కంపెనీ ప్లాన్ చేసింది. గత వారం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఈ ఏటీఎం మెషీన్లను ప్రదర్శించారు. దీంతో వినియోగదారులు ఈ మెషీన్లు లేదా సెల్ఫ్-కేర్ యాప్ ద్వారా సిమ్ కార్డును పొందవచ్చు. వీటిని రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రదేశాలలో అమర్చనున్నారు. ఇది ఒకరకంగా BSNL తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా

ఇదిలా ఉంటే BSNL తన మొబైల్ నెట్‌వర్క్‌లో స్పామ్ కాల్‌లను నిలిపివేయాలని కూడా ప్లాన్ చేసింది. స్పామ్ కాల్‌లను ఎదుర్కోవడానికి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)కి సంబంధించిన పరిష్కారాలపై ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా BSNL తక్కువ ధర మొబైల్ విభాగంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కొత్త ఫోన్‌లు జియో భారత్ 4జీ ఫీచర్ ఫోన్‌లతో పోటీ పడనున్నాయని తెలుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు