BSNL: ఇంటికి దూరంగా ఉన్నా.. దేశంలో ఎక్కడైనా.. అబ్బా కొత్త ప్లాన్ అదిరింది! బీఎస్‌ఎన్‌ఎల్ జాతీయ Wi-Fi రోమింగ్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా BSNL FTTH (ఫైబర్-టు-ది-హోమ్) వినియోగదారులను భారతదేశం అంతటా BSNL నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. దీంతో ఎక్కడినుండైనా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను పొందొచ్చు. By Seetha Ram 13 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే కొత్త కొత్త ఆఫర్లతో తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తుంది. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ లు భారీగా పెంచేసిన తర్వాత బీఎస్ఎన్ఎల్ సరిగ్గా అదే సమయంలో చీపెస్ట్ ప్లాన్ లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇతర నెట్ వర్క్ యూజర్లు ఒక్కసారిగా బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిపోయారు. ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై! ఇక అక్కడ నుంచి మరింత మంది వినియోగదారులను చేర్చుకునేందుకు బీఎస్ఎన్ఎల్ కంపెనీ కొత్త సేవలను అందిస్తూ అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే 4జీ నెట్ వర్క్ విస్తరించేందుకు రంగం సిద్ధం చేసింది. అదే సమయంలో 5జీ ప్రారంభానికి ముందు కొత్త లోగో ఆవిష్కరణకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే! 7 కొత్త సేవలు ఇవే కాకుండా మరిన్ని సేవలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 7 కొత్త సేవలను ప్రారంభించింది.ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, స్పామ్ డిటెక్షన్, వైఫై రోమింగ్, ఐఫ్‌టీవీ, రియల్‌టైం డిజాస్టర్ రెస్పాన్స్ సహా సెఫ్టీ ఫీచర్‌లతో సురక్షితమైన నెట్‌వర్క్, డైరెక్ట్ టూ డివైస్ సేవలు, ఈ ఆక్షన్ వంటి సేవలను తాజాగా ప్రారంభించింది. ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు! ఇందులో కంపెనీ తీసుకొచ్చిన జాతీయ Wi-Fi రోమింగ్ సేవల విషయానికొస్తే.. ఇది BSNL FTTH (ఫైబర్ టు ది హోమ్) వినియోగదారులను దేశమంతటా బీఎస్ఎన్ఎల్ కు కనెక్ట్ చేసేందుకు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం BSNL FTTH వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ ని ఏదో ఒక ప్రదేశంలో మాత్రమే పొందుతున్నారు. అయితే ఇప్పుడు బీఎస్ఎన్‌ఎల్ జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను ప్రారంభించడంతో.. ఇండియాలో ఎక్కడి నుంచి అయినా హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట ను యాక్సస్ చేసుకోవచ్చు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ! అయితే మరి FTTH జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను ఎలా ఉపయోగించాలో అనే విషయానికొస్తే.. ముందుగా దీనికోసం బీఎస్ఎన్ఎల్ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి. ఇక రిజిస్ట్రేషన్ టైంలో FTTH కనెక్షన్ నెంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. గ్రామాల్లో నివసించే వారు కూడా BSNL Wi-Fi కనెక్షన్ అందుబాటులో ఉన్నంత వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందవచ్చు. #free-wifi #bsnl #bsnl-4g మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి