Adani Group: అదానీపైనే ఇన్ని ఆరోపణలా? అసలేందుకు?

బిలియనీర్ గౌతమ్ అదానీపై ఆరోపణలు రావడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో మనీలాండరింగ్ జరిగిందని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. మళ్లీ హైగ్రేడ్‌లో బొగ్గును విక్రయిస్తున్నారని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది.

Adani Group companies
New Update

ఇండియన్ బిలియనీర్, అదానీ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీపై ఇటీవల కేసు న్యూయార్క్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ విషయంలో అదానీ కంపెనీ అధికారులకు రూ.2200 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీతో అతని మేనల్లుడు సాగర్‌పై కూడా కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో ఏడుగురిపై కూడా కేసు నమోదైందనట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై కూడా గౌతమ్ అదానీ స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయితే అదానీపై ఆరోపణలు రావడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో పలుమార్లు కూడా ఈ కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. 

ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

హిండెన్‌బర్గ్ వివాదంతో మొదటిసారి తెరపైకి..

అదానీ కంపెనీపై మొదటిసారి హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. మనీలాండరింగ్ జరిగిందని హిండెన్‌బర్గ్ గతేడాది అదానీ కంపెనీపై ఆరోపణలు చేసింది. అదానీ కంపెనీ షేర్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతుందని, మోసాలు చేస్తుందని ఓ నివేదికను హిండెన్‌బర్గ్ విడుదల చేయగా తీవ్ర దుమారం రేపింది. ఈ నివేదిక విడుదల చేసిన తర్వాత అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే ఈ కేసును దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు ఆరు మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయగా.. దీనిపై సెబీ కూడా విచారణ జరిపింది. అదానీకి సపోర్ట్‌గానే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 

ఇది కూడా చూడండి:  బద్దశ‌త్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?

హైగ్రేడ్‌లో బొగ్గును విక్రయిస్తున్నారనే..
రెండోసారి తక్కువ గ్రేడ్ ఉండే బొగ్గును హైగ్రేడ్‌లో విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2014లో అదానీ కంపెనీ ఇండోనేషియా కంపెనీ నుంచి 28 మిలియన్ల బొగ్గును కొనుగోలు చేసింది. సుమారుగా రూ.2360 తక్కువ ధరకి కొనుగోలు చేసి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అధిక నాణ్యత ఉన్న బొగ్గుగా రూ.7750కి విక్రయించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ఓ నివేదికను తెలిపింది. 

ఇది కూడా చూడండి:  AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?

మాధబి పూరీపై ఆరోపణలు
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ సెబీ చీఫ్ మాధబి పూరీపై ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌కు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీలో మాధబి పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. అందుకే అదానీపై చేసిన ఆరోపణల విషయంలో సెబీ చర్యలు తీసుకోలేదని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. సెబీ ఛైర్‌పర్సన్ హోదాలో ఉండి కూడా ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనం అందుకున్నారని, అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్‌తో సెబీకి సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపణలు చేసింది. 

ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!

#adani-groups #adani-hindenburg #Hindenburg crisis
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe