Railway Minister: టిష్యూ పేపర్‌ పై రైల్వే మంత్రికి ఐడియా.. అంతే 6 నిమిషాల్లో మంత్రి నుంచి కాల్‌!

వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డైరెక్టర్ అక్షయ్ తన ఐడియాను ఓ టిష్యూ పేపర్ మీద రాసి రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్ కు పంపాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే అతనికి రైల్వే శాఖ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చి తన ఐడియాను ఆమోదిస్తున్నట్లు వారు తెలిపారు.

New Update
Railway Minister: టిష్యూ పేపర్‌ పై రైల్వే మంత్రికి ఐడియా.. అంతే 6 నిమిషాల్లో మంత్రి నుంచి కాల్‌!

Tissue Paper : షార్క్ ట్యాంక్ ఇండియా(Shark Tank India) లో మీరు చాలా బిజినెస్ ఐడియా(Business Idea) లను చూసి ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి వచ్చి తమ వ్యాపార ఆలోచనలను షార్క్‌లకు అందించారు. అయితే ప్రస్తుతం బిజినెస్ ఐడియా మాత్రం సోషల్‌ మీడియా(Social Media) లో వైరల్‌ గా మారింది. అసలు ఈ బిజినెస్ ఐడియా విమానంలో ఓ టిష్యూ పేపర్‌(Tissue Paper) మీద రాయడం జరిగింది.

అంతే విమానం ల్యాండ్ అయిన 6 నిమిషాల తరువాత ఐడియా ఇచ్చిన వ్యక్తికి ఓ ఆఫర్‌ వచ్చింది.వాస్తవానికి, కోల్‌కతా(Kolkata) కు చెందిన ఓ యువ పారిశ్రామిక వేత్త అక్షయ్ సత్నాలివాలా(Akshay Sathnalivala) తన వ్యాపార ఆలోచన పై చాలా కాలం నుంచి ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. కానీ కొన్ని సమస్యల వల్ల అది కుదరలేదు. ఫ్లైట్‌లో రైల్వే మంత్రి కూడా తనతో పాటు ప్రయాణిస్తుండడం చూసి అతను తన ఐడియాను పంచుకోవాలని ఎలాగైనా మంత్రితో పంచుకోవాలనుకున్నాడు. కానీ మంత్రి అవ్వడం వల్ల ప్రోటోకాల్‌ నిబంధనలు అడ్డు వచ్చాయి.

అక్షయ్ సత్నాలివాలా ఫిబ్రవరి 2న ఢిల్లీ నుంచి కోల్‌కతాకు విస్తారా విమానంలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఆ విమానంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) కూడా ప్రయాణిస్తున్నట్లు చూశాడు. రైల్వే మంత్రిని చూడగానే ఆపుకోలేక తన బిజినెస్ ఐడియాని ఆయనతో పంచుకోవాలనిపించింది. కానీ ఫ్లైట్ ప్రొటోకాల్, భద్రత కారణంగా, అక్షయ్ రైల్వే మంత్రిని చేరుకోలేకపోయాడు.

టిష్యూ పేపర్‌పై ఐడియా రాసి...

ఈ అవకాశాన్ని వదులుకోకూడదని వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డైరెక్టర్ అక్షయ్ నిర్ణయించుకున్నాడు. అతను తన వ్యాపార ఆలోచనను అశ్విని వైష్ణవ్‌కి తెలియజేయడానికి తన తెలివిని ఉపయోగించాడు. తన ముందు ఉంచిన టిష్యూ పేపర్ తీసుకుని దానిపై తన బిజినెస్ ఐడియా రాసుకున్నాడు. అనేక ప్రయత్నాల తర్వాత, రైల్వే మంత్రికి ఈ టిష్యూ పేపర్‌ను అందించడంలో అక్షయ్ విజయం సాధించాడు.

6 నిమిషాల తర్వాత కాల్ ..

కోల్‌కతాలో ఫ్లైట్ ల్యాండ్ అయిన తరువాత అక్షయ్ కూడా విమానం దిగాడు. అయితే కేవలం 6 నిమిషాల తరువాత అతనికి ఓ ఫోన్‌ కాల్‌ రావడం అక్షయ్‌ గమనించాడు. ఈస్ట్రన్ రైల్వే హెడ్‌క్వార్టర్స్ జనరల్ మేనేజర్ కార్యాలయం నుండి ఈ కాల్ వచ్చింది. అక్షయ్ తన వ్యాపార ఆలోచన బాగుందని, GM మిలింద్ కె దేవస్కర్ అక్షయ్‌తో సమావేశం కావాలని కోరాడు.

రైల్వే మంత్రి తన ఆలోచనను ఇంత శ్రద్ధగా చదివి చర్య కూడా తీసుకున్నారంటే అక్షయ్ నమ్మలేకపోయాడు. మూలాల ప్రకారం, ఈ వ్యాపార ఆలోచన వ్యర్థాలను డంపింగ్ చేయడంలో సహాయపడటానికి రైల్వే మార్గం ద్వారా పెద్ద మొత్తంలో ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలను రవాణా చేయడానికి సంబంధించినది.

Also read: హల్ద్వానీలో ఉద్రిక్తత పరిస్థితులు.. మసీదు, మదర్సా కూల్చివేత..పోలీసుల పై రాళ్లు రువ్విన ప్రజలు!

Advertisment
తాజా కథనాలు