Bus Accident: 200 అడుగుల లోతు లోయలో పడిన బస్సు!

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డు పై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

New Update
Bus Accident: 200 అడుగుల లోతు లోయలో పడిన బస్సు!

Bus Accident: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డు పై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భలేసా నుంచి థాత్రికి ఓ ప్రైవేట్ మినీ బస్సు వెళ్తుండగా భాటియాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికక్కడే ఒక మహిళ చనిపోయారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు.

వీరిలో మరో మహిళ, బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు. మృతులను బషీరా బేగం (50), సలీమా బేగం (55), బస్సు డ్రైవర్ మహ్మద్ ఆసిఫ్ (25)గా అధికారులు గుర్తించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది ప్రయాణికులు పరిస్థితి విషమంగా ఉందని, వారికి దోడాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్న దోడా డిప్యూటీ కమిషనర్ హర్విందర్ సింగ్, ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

Also read: కొద్దిసేపట్లో తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం

Advertisment
తాజా కథనాలు